పెళ్లి వేడుకలో వధూవరుల తర్వాత అంత ఇంపార్టెన్స్ ఉన్న వ్యక్తి ఫొటోగ్రాఫర్. వివాహ వేడుకలో వధూవరుల తల్లిదండ్రులు ఎంత బిజీగా ఉంటారో అంతకంటే బిజీగా ఫొటోగ్రాఫర్ ఉంటారు. ప్రతి మూమెంట్‌ను క్యాప్చర్ చేస్తూ.. వారి స్పెషల్ డే ను లైఫ్ లాంగ్ గుర్తుంచుకునేలా మెమొరీస్ క్రియేట్ చేస్తూ ఉంటారు ఫొటోగ్రాఫర్స్. కానీ ఓ ఫొటోగ్రాఫర్ మాత్రం ఓవైపు ఫొటోలు తీస్తూనే మరోవైపు బంధువులతో కలిసి స్టెప్పులేశాడు. అదేంటి.. డ్యాన్స్ చేస్తూ ఫొటోలు, వీడియోలు తీయడమేంటని అనుకుంటున్నారా.. అదే మరి స్పెషాలిటీ..!
కెమెరాను వదలకుండా ఫ్లోర్‌పై అద్భుతంగా డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు ఈ ఫొటో గ్రాఫర్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ మారింది. ఇప్పటివరకు రెండు లక్షల మందికి పైగా వీక్షించారు. అతడి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ‘‘మీ డాన్స్ సూపర్ అంటూ ఒకరు.. ఏం చేశాడు భయ్యా.. డ్యాన్స్ ఇరగదీశాడు అంటూ ఇంకొకరు.. కామెంట్లు చేశారు. మొత్తానికి ఈ ఫొటోగ్రాఫర్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాడు.
if your wedding camera man ain’t doing this …..ask for refund pic.twitter.com/UGOwDdedi5
— Punjabi Touch (@PunjabiTouch) August 14, 2023