9 ఏళ్ల తర్వాత వికెట్ తీసిన కోహ్లీ.. అనుష్క శర్మ షాకింగ్ రియాక్షన్

-

నిన్న జరిగిన నెదర్లాండ్ జట్టుపై కూడా టీమిండియా గ్రాండ్ విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా ఏకంగా160 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి ఏకంగా 410 పరుగులు చేసింది.అనంతరం బ్యాటింగ్కు వచ్చిన నెదర్లాండ్ జట్టు 250 పరుగుల వద్ద ఆలౌట్ అయింది.

Virat Kohli Takes ODI Wicket After 9 Years For India, Gets Standing Ovation From Anushka Sharma

అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా వెటరన్ విరాట్ కోహ్లీ బ్యాట్ తోనే కాదు బంతితోను తన బౌలింగ్ స్కిల్స్ ను చూపించాడు. నెదర్లాండ్స్ తో బెంగళూరు వేదికగా జరుగుతున్న మ్యాచ్లో బౌలింగ్ చేసిన విరాట్ కోహ్లీ…. సారథి స్కాట్ ఎడ్వర్డ్స్ వికెట్ పడగొట్టాడు. అంతర్జాతీయ క్రికెటలో కోహ్లీకి 9 ఏళ్ల తర్వాత ఇదే తొలి వికెట్ కావడం గమనార్హం. కోహ్లీ చివరిసారిగా 2016 టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో వికెట్ పడగొట్టాడు. ఆ తర్వాత వికెట్ తీయడం ఇదే ప్రథమం.

Read more RELATED
Recommended to you

Exit mobile version