జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. విపక్షాలు ఓటింగ్ కు పట్టుబట్టడంతో… జమిలి ఎన్నికల బిల్లుపై ఓటింగ్ కు స్పీకర్ ఓం బిర్లా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో లోక్ సభలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్ ప్రవేశ పెట్టే అంశం పై ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
నూతన పార్లమెంట్ లో తొలిసారిగా ఇలా ఓటింగ్ జరుగుతోంది. ఇక అంతకు ముందు… లోక్ సభలో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. ఈ మేరకు 129 రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్ర సర్కార్. ఈ జమిలి ఎన్నికల బిల్లు ఆమోదానికి 361 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. కానీ ఎన్డీయేకు 293 మంది ఎంపీల మద్దతు ఇప్పటికే ఉంది. అటు ఇండియా కూటమికి 235మంది ఎంపీల మద్దతు ఉంది. జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తోన్నాయి ప్రతిపక్షాలు.