ఈపీఎఫ్ఓ చందాదారులకు అలర్ట్. వ్యక్తిగత వివరాల్లో మార్పులు చేయడానికి, పీఎఫ్ ఖాతాల పరిష్కారానికి సంబంధించిన విధివిధానాల్లో ఈపీఎఫ్‌ఓ పలు మార్పులు చేసింది. చందాదారుడు, తండ్రి, తల్లి, భార్య పేర్లలో తప్పులు ఉంటే జాయింట్ డిక్లరేషన్ల ద్వారా సవరణ చేసేందుకు అవకాశం కల్పించింది. ఖాతాదారు, తండ్రి, తల్లి, జీవిత భాగస్వామి పేర్లలో తప్పులు దొర్లితే జాయింట్ డిక్లరేషన్ల ద్వారా సవరణలకు అవకాశం కల్పించింది. యూఏఎన్ ప్రొఫైల్‌లో పుట్టిన తేదీ, ఇతర సమాచారంలో ఏదైనా సవరణ చేయాలంటే.. ఖాతాదారు ధ్రువీకరణ కోసం అవసరమైన పత్రాలను సమర్పించాలి. ఇందుకోసం ఆధార్, పాన్, పాస్‌పోర్ట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.
పేరులో రెండు అక్షరాలకు మించి సవరణ చేయాల్సి ఉంటే గతంలో పెద్ద మార్పుగా పరిగణించగా.. ఇప్పుడు ఆ పరిమితిని మూడుకు పెంచింది. స్పెల్లింగ్ పరంగా చేయాల్సిన మార్పులకు, పూర్తి పేరు నమోదు చేసుకునేందుకు అక్షరాల పరిమితిని తొలగించింది. పెళ్లి తర్వాత భార్య ఇంటి పేరు మార్చాల్సి ఉన్నా వాటిని చిన్న సవరణలుగానే భావిస్తోంది.