పాకిస్తాన్‌లో 3000 కోట్లు దోచుకుని పారిపోయిన సంస్థతో రేవంత్ డీలింగ్ చేసుకున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్‌ఎస్ పార్టీ నేత మన్నె క్రిశాంక్. పాకిస్తాన్‌లో 3000 కోట్లు దోచుకుని పారిపోయిన “మెయిన్ హార్ట్” అనే సంస్థతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు కట్టబెట్టడానికి ప్రభుత్వం చూస్తుందని సంచలన ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్.
ప్రచార ఆర్భాటం కోసం 839 కోట్ల పెట్టుబడి అని చెప్పి బోగస్ కంపెనీలను తీసుకొస్తే ఎట్లా?? అంటూ నిలదీశారు. ఫ్రాడ్ కంపెనీలు హైదరాబాద్ నగరానికి తీసుకురావడానికి రేవంత్ రెడ్డి అమెరికా వెళ్ళాడా?? అని ఆగ్రహించారు. నాలుగు నెలల క్రితం ప్రారంభమైన ఈ వాల్స్ కర్ర హోల్డింగ్స్ 839 కోట్లు పెట్టుబడి ఎలా పెడుతుంది.? అని చెప్పారు. ఒక ఫ్రాడ్ కంపెనీ బోగస్ కంపెనీ హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతుంది అని చెప్పి పేపర్ యాడ్స్ తో ప్రచారం చేసుకుంటారా?? అని నిలదీశారు బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్.