కురుక్షేత్రం తర్వాత పాండువులు ఏమయ్యారు..? వాళ్లు ఎలా చనిపోయారు..?

-

మహాభారతం.. అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన ఇతిహాసం ఇది. మాహాభారతం ఎన్నిసార్లు చూసినా, చిదివినా.. ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. డిస్నీహాట్‌సార్ట్‌లో మహాభారతం 198 ఎపిసోడ్స్‌లో ఉంది. అది మొత్తం చూస్తే.. ప్రతి మనిషికి ఒకటే ప్రశ్న మెదులుతుంది.. పాండవులు కురక్షేత్రం తర్వాత ఏం అయ్యారు అనీ.. మనసుతో కథను అర్థం చేసుకుంటే.. అందులో ప్రతి పాత్ర నీ జీవితంలో ఉన్నట్లే అనిపిస్తుంది. కృష్ణుడు చెప్పిన గీత, చూపిన లీలలు, చేసిన పనులు ఇవన్నీ మనకు ఎంతో నచ్చుతాయి. ఈ తరం పిల్లలకు తప్పక చూపించాల్సిన ఇతిహాసం మహాభారతం..అయితే కురక్షేత్రం వరకే అందిరికి తెలుస్తుంది..కానీ ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలని కథ విన్న వాళ్లకు ఉత్సుకత ఉంటుంది.. అసలు పాండవులు ఎలా చనిపోయారు..? మరి ఏం జరిగిందో తెలుసుకుందామా..!

మహాభారత యుద్ధం జరిగాక చాలా ఘట్టాలు చోటు చేసుకున్నాయి. ప్రస్తుతం మనం యుద్ధం పూర్తి అయ్యాక అసలు ఏమి జరిగిందో.. పాండవులు ఏమయ్యారో తెలుసుకుందాం. కురుక్షేత్రంలో యుద్ధం పద్దెనిమిది రోజుల పాటు సాగింది. ఈ యుద్ధంలో కౌరవులు ఓడిపోతే.. పాండవులు విజయం సాధించారు. దాదాపు ఎనభై శాతం మంది పురుష జనాభా ఈ యుద్ధంలో మరణించింది. ఈ యుద్ధం పూర్తయ్యాక ఎవరెవరు బతికారు.. వారు ఏమి చేసారు అన్నది చాలా తక్కువ మందికి తెలుసు.

పాండవులు విజయం సాధించాక.. వారు హస్తినాపురానికి రాజులు అయ్యి.. పాలనా కొనసాగించారు. కౌరవులు యుద్ధంలో ఓడిపోయి మరణించడంతో.. కౌరవుల తల్లి అయిన గాంధారి శ్రీకృష్ణుడిని శపిస్తుంది. నా కొడుకులలానే చనిపోతావు అంటూ శాపం పెడుతుంది. గాంధారి, దృతరాష్ట్రుడు, పాండవుల తల్లి కుంతీ వీళ్లు రాజ్యాన్ని త్యజించి వనవాసానికి వెళ్తారు. మొదట యుదిష్టురుడు అంగీకరించడు.. కానీ వాళ్లు తమ వృద్ధాప్యాన్ని అడవుల్లో బతకాలని నిర్ణయించుకుంటారు. ఈ ముగ్గురు అడివిలోనే కొన్నేళ్లపాటు జీవనం సాగించి అక్కడే మృతి చెందుతారు.

ఇక అవతార పరిసమాప్తి సమయంలో శ్రీకృష్ణుడు అడవిలో ఓ చోట కూర్చుండగా… ఆయన కాళ్ళకి ఉన్న పారాణిని చూసి.. ఓ వేటగాడు జంతువు అనుకోని భ్రమపడి చాటు నుంచి బాణం వేస్తాడు. రామావతారంలో వాలి పెట్టిన శాపం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. చాటుగా రాముడు వాలిపై బాణం వేసాడని మనందరికి తెలుసు. అప్పుడు వాలి రాముడికి కూడా అలాంటి చావు తప్పదంటూ శపిస్తాడు. మరొక అవతారంలో ఆ శాపాన్ని అనుభవిస్తానని రాముడు మాట ఇస్తాడు.. కృష్ణావతారంలో ఇలా చాటుగా వేటగాడు బాణం వేయడం వలన కృష్ణుడు మరణిస్తాడు.

ఇక పాండవుల విషయానికి వస్తే.. దాదాపు 36 సంవత్సరాల పాలన తరువాత వారు కూడా కృష్ణుడి మరణాన్ని తెలుసుకుని తమ జన్మని చాలించే సమయం ఆసన్నమైందని అనుకుంటారు. అభిమన్యుడు కొడుకు పరిక్షిత్‌ను రాజును చేసి పాండువులు, ద్రౌపతి స్వర్గాన్ని చేరుకోవడం కోసం హిమాలయాలను ఎక్కడం ప్రారంభిస్తారు. వారికి తెలియకుండా యమ ధర్మరాజు కూడా శునకం రూపంలో వారితోనే వెళుతూ ఉంటాడు.

హిమాలయాలు ఎక్కుతున్న సమయం లోనే.. ద్రౌపది, భీముడు.. ఇలా ఒక్కొక్కరిగా నెలకొరుగుతూ ఉంటారు. వారు చేసిన కొన్ని పాప కర్మల వలన వారు నరకానికి చేరుకుంటారు. ఇక యుధిష్టరుడు మాత్రం చివర వరకు ఎక్కగలుగుతాడు. యుధిష్టరుడు ఒక్కడు మిగిలిపోయిన తరువాత.. యమధర్మ రాజు శునకరూపాన్ని వీడి.. అసలు రూపం ధరిస్తాడు. స్వర్గలోకాధిపతి ఇంద్రుడు ఆయనను స్వర్గానికి తీసుకెళ్ళిపోతారు. వీరంతా.. ఈ భూమిని విడిచిపెట్టాకే కలియుగం మొదలైందని చెబుతుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version