ఎవరీ అశ్వత్థామా..? కృష్ణుడు ఎందుకు అతన్ని శపిస్తాడు..?

-

కల్కి సినిమా చూసినవాళ్లందరికీ కామన్‌గా ఒక డౌట్‌ వస్తుంది.. ఎవరీ అశ్వత్థామా..? సినిమాలో హీరో కంటే ఎక్కువ ఎలివేషన్‌ అశ్వత్థామాకే ఎందుకు ఇచ్చారు అని.. మహాభారతం గురించి తెలిసినవాళ్లకు ఐడియా ఉంటుంది. అసలు కల్కీ సినిమా అర్థంకావాలంటే మహాభారతం తెలిసి ఉండాలి..కనీసం ఆ కురుక్షేత్రం గురించి అయినా తెలిసి ఉండాలి.  ఈరోజు అశ్వత్థామా ఎవరో, శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపం ఏంటో తెలుసుకుందాం..!
పాండవులు, కౌరవులకు గురువైన ద్రోణుని ఏకైక కుమారుడే ఈ అశ్వత్థామ. అతడి తల్లి కృపి. ద్రోణుడి తపస్సుకు మెచ్చి, శివుని వరం వల్ల అతడు నుదుటిపై మణితో జన్మిస్తాడు. ఆ మణి ప్రభావం కారణం ఇతర మానవులతో పోలిస్తే, ఆకలి, దప్పుల నుంచి రక్షణ పొందగలడు. అర్జునుడితో సమానంగా ధనుర్విద్యలో నైపుణ్యం సాధిస్తాడు. ఎదుటి వారి ముఖస్తుతికి లొంగిపోయే గుణం కలిగిన అశ్వత్థామ.. మొదటి నుంచి కౌరవుల పక్షానే ఉంటాడు. మహాభారత సంగ్రామంలో ద్రోణాచార్యుడు కౌరవుల పక్షాన నిలబడాల్సి వస్తుంది. కదన రంగంలో ఆయనను ఓడించడం పాండవులకు అసాధ్యం. దీంతో ధర్మ పరిరక్షణ కోసం కృష్ణుడు పథకం రచిస్తాడు.
జీవితంలో ఎప్పుడూ అసత్యం పలకని ధర్మరాజును పిలిచి ఆయన చనిపోయాడని చెప్పమని కోరతాడు. ధర్మరాజు అందుకు ఒప్పుకోడు. కానీ, కృష్ణుడి సూచన మేరకు అబద్ధం ఆడేందుకు సరేనంటాడు. అశ్వత్థామా అనే ఏనుగును చంపి..  ద్రోణాచార్యుడు పాండవ సైన్యంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న సమయంలో ఎదురుగా వచ్చిన ధర్మరాజు ‘అశ్వత్థామ హతః..’ అని గట్టిగా చెప్పి.. ‘కుంజరః’ అని నెమ్మదిగా అంటాడు. అంటే చనిపోయింది అశ్వత్థామా అనే ఏనుగు.. కానీ ద్రోణుడు తన కుమారుడే చనిపోయాడు అనుకోని శస్త్రాలను త్యజిస్తాడు.. ఇదే అదనుగా భావించిన దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుడిని చంపేస్తాడు.

కృష్ణుడు అశ్వత్థామాను ఎందుకు శపించాడు..?

యుద్ధం దాదాపు ముగుస్తుంది.. కొనఊపిరితో ఉన్న దుర్యోదనుడు..  అశ్వత్థామను పాండవులను చంపమని కోరతాడు.. శిబిరంలో నిద్రపోతున్న ఉపపాండవులే పాండవులు అనుకోని అశ్వత్థామా ఉపపాండవులను చంపి ఆ విషయం దుర్యోదనుడికి చెప్తాడు. అప్పుడు దుర్యోదనుడు ప్రాణాలు వదులుతాడు.. ఉపపాండవులను చంపినందుకు కృష్ణుడు, పాండవులు కోపోద్రిక్తులై అశ్వత్ధామ దగ్గరకు వెళ్తారు.. పాండవులను చూసి అశ్వత్థామా షాక్‌ అవుతాడు. చంపింది ఉపపాండవులను అని తెలుసుకుంటాడు.. ఇప్పుడు వంశంలో ఉన్న ఏకైక ఊపిరి అభిమన్యుడి కుమారుడు. అభిమన్యుడి అప్పటికే యుద్ధంలో మరణిస్తాడు.. ఉత్తర కడుపులో ఉన్న అభిమన్యుడి కుమారిడ్ని చంపేందుకు అశ్వత్థామా బ్రహ్మశిరోనామకాస్త్రం ప్రయోగిస్తాడు.
దాన్ని అడ్డుకోమని అర్జునుడిని ఆదేశిస్తాడు శ్రీకృష్ణుడు. బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని అడ్డుకోవాలంటే అదే అస్త్రాన్ని ప్రయోగించాలి. అర్జునుడి తపోశక్తి వల్ల అప్పటికే ఆ  అస్త్రాన్ని పొంది ఉండటంతో ‘పాండవులకు క్షేమం చేకూరుగాక’ అని మరోవైపు నుంచి అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. రెండూ బ్రహ్మశిరోనామకాస్త్రాలు ఢీకొంటే ప్రళయమే. భూమండలమంతా సర్వనాశనమైపోతుంది. వెంటనే ఈ ఉపద్రవాన్ని గ్రహించిన వ్యాస మహర్షి, నారదుడు పరుగు పరుగున వచ్చి, అస్త్రాన్ని ఉపసంహరించుకోవాల్సిందిగా అర్జునుడిని కోరతారు. పెద్దల సూచన మేరకు అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకుంటాడు.
‘మరి అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రం మాటేమిటి గురువర్యా’ అని వ్యాసుడిని అర్జునుడు అడగ్గా.. ‘అస్త్రాన్ని ఉపసంహరించు. పాండవులు నిన్ను ఏమీ చేయరు’ అని అశ్వత్థామకు వ్యాసుడు సూచిస్తాడు. కానీ అశ్వత్థామా అలా చేయడు.. అస్తప్రయోగం వల్ల ఉత్తర( అభిమన్యుడి భార్య) గర్భంలో తీవ్రమైన నొప్పి వస్తుంది.. కృష్ణుడు అశ్వత్థామ చేసిన పనులకు చాలా కఠినమైన శాపాన్ని ఇస్తాడు. అతని ముఖంపై ఉన్న మణిని తొలగించి… చావు లేకుండా ఒళ్లంతా గాయాలతో, చీము నెత్తురలతో ఉంటావని.. చూసేందుకు కూడా ఎవరు రారని, అడవుల్లో ఆహారం లేక దిక్కులేకుండా తిరుగుతావని, చావుకోసం పరితపించినా చావు నిన్ను వరించదని కృష్ణుడు శపిస్తాడు.
ఇక ఉత్తర గర్భంలో ఉన్న కుమారుడిని శ్రీకృష్ణుడి తన యోగ మాయతో బతికిస్తాడు.. ఆ బిడ్డ పుట్టకముందే చావును జయించాడని, పరీక్ష ఎదుర్కొన్నాడని ఆ బిడ్డకు శ్రీ కృష్ణుడు పరీక్షిత్‌ అని పేరు పెడతాడు.. అయితే కృష్ణుడు పెట్టిన శాపానికి బదులుగా అశ్వత్థామా నాకు ఎప్పుడు చావు వస్తుంది.. నాకు ప్రాయిశ్చిత్తం ఏంటి అని అడుగుతాడు.. అప్పుడు కృష్ణుడు.. కలియుగం అంతం అయ్యే సమయంలో నేను కల్కి అవతారంలో జన్మిస్తానని, నా గర్భగుడిని కాపాడే బాధ్యత నీదే అని చెప్తాడు.. ఎలా నేను కనిపెట్టడం అని అశ్వత్థామా అడిగినప్పుడు నీ మని నీకు తిరిగి వస్తుంది.. అదే సంకేతం అంటాడు కృష్ణుడు..! అది మ్యాటర్‌.. కల్కి సినిమాలో ఈ సీన్స్‌ అన్ని చూపిస్తారు.. మీకు ఇది తెలిసి ఉంటే..సినిమా క్లియర్‌గా అర్థమవుతుంది..! అశ్వత్థామా కృష్ణుడి చెప్పినట్లు గర్భగుడిని ఎలా కాపాడతాడు.. కలియుగం అంతంలో మనుషులు ఎలా మారిపోతారు అనేది కల్కీ మూవీ సారాంశం.!

Read more RELATED
Recommended to you

Exit mobile version