ఇండియా బియ్యం ఎగుమతిని ఎందుకు నిలిపేసింది..?

-

బియ్యం ఎగుమతిని ఇండియా ఆపేసింది. విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు బియ్యం కోసం బారులు తీరుతున్నారు. సోషల్‌ మీడియాలో వీటికి సంబంధించిన సమాచారం, ఫన్నీ రీల్స్‌ తెగ ట్రెండ్‌ అవుతున్నాయి. ఇండియా బాస్మతి రైస్‌ మినహా అన్ని రకాల రైస్‌ ఎక్స్‌పోర్ట్‌ను నిలిపేసింది. ఎందుకు ఇలా చేసింది..? ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇండియా ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి ఏదో ఒక కారణం అయితే కచ్చితంగా ఉంటుంది.

ఇన్ఫ్లమేషన్‌ సమస్య తగ్గించేందుకే..

తమ సరఫరా పెంచడానికి, ఇన్ఫ్లమేషన్ సమస్య తగ్గించడానికి ఎగుమతులపై తక్షణం ఇలా నిషేధం విధించడం జరిగింది. భారత్ సర్కార్ 10 నెలల క్రితం ఈ బియ్యం ఎగుమతులపై 20 శాతం సుంకం పెంచి ఆంక్షలు విధించినప్పటికీ ఎటువంటి ప్రయోజనం కనిపించలేదు. కాబట్టి ఈ రకంగా ఎగుమతిని నిషేధించక తప్పలేదు. అయితే భారత్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం మిగిలిన ప్రపంచానికి ప్రాణ సంకటంగా మారింది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా బియ్యాన్ని ఎగుమతి చేసేది భారతదేశం నుంచే.

40 శాతం ఎగుమతి ఇండియా నుంచే..

ప్రపంచం మొత్తం మీద వాడుతున్న బియ్యంలో 40 శాతంకు పైగా మన దేశం నుంచి ఎగుమతి చేయబడినవే. అయితే ప్రస్తుతం మన దేశంలో వరి ఉత్పత్తి కాస్త తలబడుతుంది. పంజాబ్, హర్యానా లాంటి ప్రదేశాలలో భారీ వర్షాలకు పంట దెబ్బతింది. మరోపక్క సరి అయిన వర్షాలు లేక కర్ణాటక ,పశ్చిమ బెంగాల్ ,ఛత్తీస్గడ్, తమిళనాడు లాంటి ప్రదేశాలలో నాట్లు వేయడం బాగా ఆలస్యం అయింది కాబట్టి పంట చేతికి వచ్చేసరికి మరింత ఆలస్యం అవుతుంది. మనకు బియ్యం కొరత వచ్చే అవకాశం ఉంది అని భావించారు కాబట్టే ఎగుమతులను నిలిపివేశారు. ఇలా ఎగుమతి నిలిపివేయడంపై దేశంలోని ఎగుమతి దారుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నిషేధం కేవలం తాత్కాలికమే అని ఆరు నెలలకు మించి ఉండకపోవచ్చు అని నిపుణులు అంచనా వేస్తున్నారు.. మరోపక్క భారత్ బియ్యం ఎగమతి ఆపివేయడంతో మిగిలిన దేశాల నుంచి ఎగుమతి అయ్యే బియ్యం ధరలు భారీగా పెరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version