దేశంలో 12 ఏళ్ల పై పడిన వారికి వ్యాక్సిన్ ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుంది. జైడస్ క్యాడిలా రూపొందించిన జైకోవ్- డీ వ్యాక్సిన్ ను ఏడు రాష్ట్రా లలో పంపిణీ చేయడానికి సిద్ధం అవుతుంది. అయితే
అంతే కాకుండా ఈ వ్యాక్సిన్ ను ఆ ఏడు రాష్ట్రాలకు పంపిణీ చేసే ముందు.. ఆయా రాష్ట్రాల ఆరోగ్య కార్యకర్త లకు శిక్షణ కూడా ఇచ్చామని ఇటీవల కేంద్రం తెలిపింది. ఈ వ్యాక్సినేషన్ లో భాగం గా కేంద్ర ప్రభుత్వం దాదాపు కోటి జై కోవ్ – డీ వ్యాక్సిన్ లను కొనుగోలు చేయనుంది. ఒక్కో డోసు కు రూ. 265 ల చొప్పున కొనుగోలు చేయనుంది. ఈ వ్యాక్సిన్ కోసం జెట్ అప్లికేటర్ పరికరం అవసరం ఉంటుంది. దానికి కోసం మరో రూ. 93 ఖర్చు చేస్తుంది. దీంతో ఒక్క డోస్ పై రూ. 358 లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.