టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. తన సినిమాలు తెలంగాణ లో రిలీజ్ చేయబోనంటూ తాజాగా ప్రకటన చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వానికి… ధన్యవాదాలు థియేటర్స్ రీ ఓపెన్ కు అవకాశం ఇచ్చారని… 15 రోజుల్లో ఆర్డర్ పాస్ చేయండి..Go 35 క్యాన్సల్ కు వైజాగ్ ఎగ్జిబిటర్స్ ఎవరు వెళ్ళలేదన్నారు. 224 మందికి తెలియకుండా కొంత మంది కోర్టు కు వెళ్లి కంప్లైంట్ చేశారని.. అసలు విషయం తెలుసుకునేందుకు విచారణకు అదేశ్శాలు ఇవ్వాలని కోరుతున్నానని తెలిపారు.
టాప్ 3 లో ఉన్న వ్యక్తి దీని వెనుక వున్నాడు..ఈ విషయం ప్రభుత్వానికి తెలుసు అన్నారు. AP ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్..లో పూసలు బాబ్జి పై కంప్లైంట్ చేస్తే..నా మీదనే యాక్షన్ తీసుకోవాలని ఛాంబర్ ప్రతినిధులు అనుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ఛాంబర్ రెండు గా విభజన చేయాలని.. మా ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులకు అన్యాయం జరుగుతూనే ఉందని ఆరోపించారు.
ఆర్ నారాయణ మూర్తి ,నేను కలసి సమస్య పరిష్కారం కోసం పని చేసామని..ఆంద్రప్రదేశ్ ఎగ్జిబిటర్స్ మాత్రమే ముందుకు వచ్చారన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రిక్వెస్ట్… చిన్న సినిమాలను కాపాడండి,పెద్ద సినిమాలు మాత్రమే బాగు పడుతున్నాయని సంచలన వ్యాక్యలు చేశారు. చిన్న సినిమాలకు 5వ షో కి పర్మిషన్ ఇవ్వాలని.. తెలంగాణ లో చిన్న సినిమాలు రిలీజ్ చేయటం చాలా కష్టమని ఆవేదన వ్యక్తం చేసారు.