అసెంబ్లీకి కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా వస్తారు – కేటీఆర్‌

-

అసెంబ్లీకి కార్తీక్ రెడ్డి ఎమ్మెల్యేగా వస్తారన్నారు కేటీఆర్‌. తెలంగాణ భవన్ లో జాయినింగ్ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. త్వరలో ఉప ఎన్నికలు వస్తాయని… కార్తీక్ రెడ్డి అసెంబ్లీ కి ఎమ్మెల్యే గా వస్తారని ప్రకటించారు. కేసీఆర్ దళం గులాబీ వనం లోకి వస్తున్న అందరికీ స్వాగతం అన్నారు. నిన్న కాంగ్రెస్ మీటింగ్ లో మూడు ఆణిముత్యాల మాటలు చెప్పారని ఆగ్రహించారు.

KTR on karthik reddy

మంచి మైక్ లో చెప్పాలి చెడు చెవిలో చెప్పాలి అన్నారని… మంచి చెప్పడానికి నువ్వు చేసిన ఒక్క మంచి పని లేదని చురకలు అంటించారు. రేవంత్ రెడ్డి చేసిన చెడు చెబిత్ చెవిలో చెబితే చెవిలో రక్తాలు కారుతాయని తెలిపారు. కొత్తగా వచ్చిన ఇంచార్జి మీనాక్షి తన బ్యాగ్ మొయొద్దు అని చెప్పిందని వివరించారు.

నీ పక్కన కూర్చున్న రేవంత్ రెడ్డి నే బ్యాగ్ లు మోసి పైకి వచ్చాడని సెటైర్లు పేల్చారు. ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి ని బండ బూతులు తిడుతున్నారు… రైతు బంధు ఎవరికీ పడడం లేదు అని తిడుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఉన్నప్పుడు టింగ్ టింగ్ మని పడేవి అని చెబుతున్నారు… అందుకే రేవంత్ రెడ్డి టింగ్ టింగ్ అనే పదం పడదన్నారు. అందుకే టకీ టకీ మని రైతు భరోసా పడుతుంది అంటున్నాడని సెటైర్లు పేల్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version