స్టార్ హీరోలు నటించిన ”న‌వ‌ర‌స” ట్రైల‌ర్ రిలీజ్

-

కరుణ, శాంతం, హాస్యం, అద్భుతం, శృంగారం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం.. ఇలా తొమ్మితి నవరసాల నేపథ్యంలో తొమ్మిది కథలతో ప్రముఖ దర్శకుడు మణిరత్నం నిర్మించిన వెబ్‌ సిరీస్‌ ‘నవరస’. అయితే.. ఈ వెబ్‌ సీరిస్‌ ను ఒక్కో భాగానికి ఒక్కో దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. ఈ వెబ్‌ సీరిస్‌ లో హీరో సూర్య, సిద్ధార్థ్‌, విజయ్‌ సేతుపతి, రేవతి, ఐశ్వర్య రాజేశ్‌, అరవింద్‌ స్వామి, రోబో శంకర్‌, యోగిబాబు, అంజలి తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ వెబ్‌ సిరీస్‌.. ఆగస్టు 6 నుంచి ప్రముఖ ఓటీటీ”నెట్‌ ఫ్లిక్స్‌” లో స్ట్రీమింగ్‌ కాబోతుంది. ఈ నేపథ్యంలో మంగళ వారం ఈ నవరస వెబ్‌ సిరీస్‌ ట్రైలర్‌ ను రిలీజ్‌ చేశారు. టైటిల్‌ కు తగ్గట్టుగానే తొమ్మిది రకాల భావోద్వేగాలను ట్రైలర్‌ లో చాలా అద్భుతంగా చూపించారు దర్శకులు. ఈ ట్రైలర్‌ కు బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌ చాలా బాగా సెట్‌ అయింది. అలాగే అగ్రతారలంతా ఒకే తెరపై కనిపించడం కొత్త అనుభూతిని కలిగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version