NAVEEN POLISHETTY : అనుష్క మూవీలో నవీన్ పోలిశెట్టి.. ఫస్ట్ లుక్ రిలీజ్

-

తెలుగులో స్టార్ హీరోయిన్ గా… లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఓ వెలుగు వెలిగిన అనుష్క శెట్టి… ప్రస్తుతం మరో మూవీకి సిద్ధమవుతోంది. గత ఏడాది నిశ్శబ్దం సినిమాతో… నిరాశపరిచిన ఈ అమ్మడు.. తాజాగా యు.వి.క్రియేషన్స్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెంబర్ 14 పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు మహేష్ బాబు పి దర్శకత్వం వహిస్తుండగా యు వి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాకు ఇంకా టైటిల్ ను అనౌన్స్ చేయలేదు.

ఈ సినిమాలో ప్రధాన పాత్రలో అనుష్క కనిపించనుండగా… జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే తాజాగా ఈ సినిమా నుంచి చిత్రబృందం ఓ బిగ్ అప్డేట్ వదిలింది. నవీన్ పొలిశెట్టి ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం విడుదల చేసింది. నవీన్ పొలిశెట్టి బర్త్డే నేపథ్యంలో ఇవాళ ఈ పోస్టర్ను వదిలినట్టు పేర్కొంది. అయితే ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాడనే ఇంకా క్లారిటీ రాలేదు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version