నయనతార కొత్త బాయ్ ఫ్రెండ్, దర్శకుడు విఘ్నేష్ శివన్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటాడు. అతను తరచూ అభిమానుల కోసం తన గర్ల్ ఫ్రెండ్ నయనతారతో ఉన్న ఫోటోలు అప్లోడ్ చేస్తూ ఉంటాడు. అయితే ఈసారి మాత్రం ఆయన నయనతార తన ఉంగరాన్ని చూపిస్తూ తన గుండెల మీద చేయి వేసిన ఉన్న ఫోటోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ఈ ఫోటోను షేర్ చేసిన తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విఘ్నేష్ శివన్, నయనతార నిశ్చితార్థం జరిగిందా అని అభిమానులు ఆసక్తిగా కామెంట్లు చేస్తున్నారు. విగ్నేష్ శివన్ ఫోటోను షేర్ చేస్తూ తమిళ్ లో ఒక ఫేమస్ పాట యొక్క సాహిత్యాన్ని కామెంట్ గా ఉపయోగించారు. దీంతో వీరి ఎంగేజ్మెంట్ అయిపోయిందని ప్రచారం మొదలైంది.