నయీమ్ గ్యాంగ్ స్టర్ కేసులో పోలీస్ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని సిట్ తేల్చేసింది. నయీమ్ సమాంతర ప్రభుత్వాన్ని నడిపించి అనేక హత్యాకాండలు, భూ దందాలు చేయించాడని సీపీఐ నారాయణ అన్నారు. నయీమ్ కేసులో పూర్తి స్థాయి దర్యాప్తు చేసి అధికారులు పై చర్యలు తీసుకోవాలని సీపీఐ నారాయణ డిమాండ్ చేశారు. గతంలోనే నయీమ్ కేసు మీద హైకోర్టు కి వెళ్లిన సీపీఐ నారాయణ ఇప్పుడు మళ్ళీ వెళ్లనున్నారు.
నయీమ్ దందాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న పోలీస్ అధికారులకు సిట్ క్లిన్ చిట్ ఇచ్చిన నేపధ్యంలో 25 మంది పోలీస్ అధికారులకి నయీమ్ తో ఉన్న సంబంధాల మీద మరో సారి కోర్ట్ మెట్లు ఎక్కునున్నారు నారాయణ. 2016 ఆగస్టు 8న షాద్ నగర్ లో ఎన్కౌంటర్ లో నయీమ్ హతమయ్యాడు. ఇప్పటి వరకు 240 కేసుల్లో 173 కేసులకు సంబంధించి సిట్ ఛార్జ్ షీట్ లు వేసింది. ఎనిమిది మంది రాజకీయ నాయకులు పేర్లను సిట్ చేర్చగా ఛార్జ్ షీట్ లో ఎక్కడా పోలీస్ అధికారులు పేర్లు కనిపించలేదు.