రాశీ ఖన్నా హీట్ పెంచేస్తోంది…

-

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన రాశీఖన్నా, తన అందంతో అందర్నీ ఊహల్లో విహరించేలా చేసింది. మొదటి సినిమాతోనే నటిగా, గ్లామర్ పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాశీ, స్టార్ హీరోయిన్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత వచ్చిన ఫ్లాపులు స్టార్ హీరోయిన్ కానీకుండా ఆపేసాయి. ఐతే వెంకీమామా, ప్రతీ రోజూ పండగే సినిమాలతో కొంత ట్రాక్ మీదకి వచ్చిందనే చెప్పాలి. కానీ ఆ తర్వాత వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో మళ్లీ చతికిల పడింది.

ప్రస్తుతం ఆమె చేతిలో రెండు తమిళ సినిమాలున్నాయి. తెలుగులో ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఐతే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉంటున్న రాశీఖన్నా క్రేజీ క్రేజీ ఫోటోషూట్లతో కుర్రకారుని కిర్రెక్కిస్తుంది. తాజాగా రాశీ పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. గ్లామరస్ లుక్ తో హీటెక్కిస్తూ సోషల్ మీడియా ఫాలోవర్ల మతి పోగొడుతోంది. మొదట్లో గ్లామర్ గా కనిపించడానికి కొద్దిగా తడబడిన రాశీ, ఆ తర్వాత హీట్ పెంచుతూ పోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version