డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కు మళ్లీ నిరాశే ఎదురైంది. మూడోసారి బెయిల్ పిటీషన్ పెట్టుకున్న ఆర్యన్ ఖాన్ కు చుక్కెదురైంది. తాజాగా ముంబై కోర్ట్ బెయిల్ పై తీర్పును ఈనెల 20కి రిజర్వ్ చేసింది. దీంతో ఈనెల 20 వరకు ఆర్యన్ ఖాన్ జైలులో గడపాల్సిందే. ఈనెల అక్టోబర్ 2న ముంబై క్రూయిజ్ షిప్ రేవ్ పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ అతని స్నేహితులు పట్టుబడ్డ సంగతి తెలిసిందే. అక్టోబర్ 3న ఎన్సీబీ ఆర్యన్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి బెయిల్ కోసం ఆర్యన్ ఖాన్ లాయర్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు.
డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ కి మళ్లీ నిరాశే…
-