ఆంధ్రప్రదేశ్ కు ప్రధాని మోడీ అదిరిపోయే బహుమతి ఇచ్చారు. ఏడు నూతన, మూడు పూర్తిగా పునర్నిర్మాణమౌతున్న ఈఎస్ఐ ఆస్పత్రులను రాష్ట్రానికి మంజూరు చేసినట్లు కేంద్రం ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించబడిన ఏడు కొత్త ఈఎస్ఐ హాస్పిటల్ ల వివరాల గురించి, వాటికి రాష్ట్ర ప్రభుత్వ సహకారం గురించి పార్లమెంట్ లో కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను నిన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు.
ఈ సందర్భంగా.. మంత్రిత్వ శాఖ స్పందిస్తూ… విశాఖపట్నంలోని నందు సుమారుగా 384.26 కోట్ల ఖర్చుతో cpwd శాఖచే నూతన ఆసుపత్రి నిర్మితం అవుతుందని, విజయనగరం లో ఈఎస్ఐ ఆస్పత్రి నిర్మాణాన్ని 73.68 కోట్ల కేంద్ర నిధులతో MECON కంపెనీ చే నిర్మిత మౌతున్నదని పేర్కొంది. కాకినాడ నందు 102.77 కోట్ల కేంద్ర నిధుల కేటాయింపు తో 19.08.20 న కేటాయించబడి cpwd శాఖ చే ఆసుపత్రి నిర్మాణం జరుగుతున్నదని, గుంటూరు,పెనుకొండ, విశాఖపట్నం అచ్యుతాపురం మరియు నెల్లూరు శ్రీ సిటీలకు నూతన ఈఎస్ఐ ఆసుపత్రులు మంజూరు చేయబడి ఇంకనూ భూసేకరణ స్థితిలో ఉన్నాయని వెల్లడించింది.
రాజమండ్రిలో ఈఎస్ఐ ఆస్పత్రి రూ.97.97 కోట్లు కేటాయించబడి ఇప్పటికే 10.90 కోట్ల నిధుల విడుదల తో పునర్నిర్మాణం cpwd శాఖచే నిర్మితమవుతున్నది అని, విశాఖపట్నం మల్కిపురంలో రూ.2179 కోట్ల కేటాయింపు తో, ఇప్పటివరకూ 19.16 కోట్ల నిధుల విడుదల తో ఎస్ఐ ఆసుపత్రి పునర్నిర్మాణం CPWD కి అప్పచెప్పబడినది అని మంత్రిత్వ శాఖ తెలియచేసింది.