తెలంగాణ రాష్ట్ర మంత్రులు అలాగే పార్లమెంట్ సభ్యులు నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు టిఆర్ఎస్ నాయకులు. ఇక ఈ ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రులు అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యాసంగి కాలంలో ధాన్యం పూర్తిగా కొనాలని.. కేంద్రం ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేయనున్నారు.
కాగా నిన్న టిఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశం అనంతరం… సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మోడీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇండియా అన్ని రంగాల్లోనూ వెనుకబడిందని… కచ్చితంగా బిజెపి ప్రభుత్వాన్ని దించాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
బిజెపి ప్రభుత్వాన్ని దించేందుకు… ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలని తాము ఇంకా అనుకో లేదన్నారు.కానీ ఓ కొత్త రూపంలో యూపీఏ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని కేసీఆర్ ప్రకటించారు. అది మరో జాతీయ పార్టీ రూపంలో కూడా రావచ్చని ఆయన పేర్కొన్నారు.