ధర్మశాలలో ఆలస్యంగా ప్రారంభం అయిన మ్యాచ్ లో టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బావుమా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 43 ఓవర్లకే కుదించిన ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ చేస్తున్న నెదర్లాండ్ తీవ్రంగా తడబడుతోంది. ఇప్పటికే సగం జట్టు పెవిలియన్ కు చేరుకుంది. ఓపెనర్లు నెదర్లాండ్ కు ఆశించిన ఆరంభాన్ని ఇవ్వలేక ఫెయిల్ అయ్యారు. విక్రంజీత్ సింగ్ (2), మాక్స్ (18), యాకర్ మాన్ (13), డి లీడ్ (2), సైబ్రాండ్ (19) లు వరుసగా అవుట్ అయ్యారు. రబడా 2 వికెట్లు తీసుకోగా, యన్సేన్ , ఎంగిడి మరియు కొయెట్జి లు తలో ఒక వికెట్ తీసుకున్నారు. సౌత్ ఆఫ్రికా తో ఆడుతున్న నెదర్లాండ్ కనీసం 200 పరుగులు అయిన చేస్తే పరువు దక్కించుకుంటుంది. కానీ అనవసర షాట్ లు ఆడి వికెట్ లు సమర్పించుకుని జట్టును తీవ్రమైన ఒత్తిడిలోకి నెట్టేశారు.
ఇప్పుడు నెదర్లాండ్ మరో వికెట్ పడకుండా కనీసం 50 పరుగులు చేసినా జట్టు స్కోర్ 200 కు వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. ప్రస్తుతం నెదర్లాండ్ 25 ఓవర్లకు పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయింది. మరి ఏమి జరగనుంది అనేది తెలియాలంటే మిగతా మ్యాచ్ ను చూడాలి.