ఏ ఆధారాలు లేకుండానే హైకోర్టు, సుప్రీం కోర్టులు చంద్రబాబును జైల్లో ఉంచారా : పేర్ని నాని

-

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాం అరెస్టైన విషయం తెలిసిందే. అయితే.. చంద్రబాబు అరెస్ట్‌పై టీడీపీ నేతలు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మాజీ మంత్రి పేర్నినాని మండిపడ్డారు. ఆధారాలు చూపకుండా జైల్లో ఎవరు పెట్టారు చంద్రబాబును అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి సంబంధం ఏంటి అరెస్ట్ చేసి న్యాయస్థానం ముందు పెట్టడమే మా బాధ్యత.. ఏ ఆధారాలు లేకుండానే సీఐడీ, ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టులు చంద్రబాబును జైల్లో ఉంచారా అని పేర్నినాని అడిగారు.

తన అపారమైన మేధస్సును చంద్రబాబు ఉపయోగించి సుమారుగా 19 కేసుల్లో స్టేలు తెచ్చుకున్నాడు అని పేర్నినాని ఆరోపించారు. ప్లిడర్లు అందరూ చంద్ర బాబు పాపపు సొమ్ముతో పండుగ చేసుకుంటున్నారు.. సాక్ష్యాలు లేకుండా ఏ కోర్టు అయినా ఏన్నాళ్ళు వుంచుతుంది జైలులో.. ఇప్పటికీ ఇన్ కం ట్యాక్స్ డిపార్ట్మెంట్ స్కిల్ డిపార్ట్మెంట్ లో అవినీతి జరిగిందని కేసులు నమోదు చేసింది.. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్, జీఎస్టీ డిపార్ట్మెంట్ లు అవినీతి జరిగినట్లు కేసులు నమోదు చేశాయని ఆయన తెలిపారు. వాటన్నిటినీ ప్రామాణికంగా చేసుకొని విచారణ చేసి కేసు నమోదు చేసింది సీఐడీ డిపార్ట్మెంట్ అని వెల్లడించారు పేర్నినాని.

 

ఒక్కసారి కోర్టు తీర్పు ఇస్తే ఇక, ఆ అంశం కోర్టుకు సంబంధించింది.. కోర్టు పరిధిలోని అంశాలను మేము ఎలా మాట్లాడతాం అని మాజీమంత్రి పేర్నినాని ప్రశ్నించారు. అయినా ఎంతో మేధస్సు కలిగిన న్యాయవాదులను పెట్టీ కేసును చంద్రబాబు వాదించుకుంటున్నారు.. రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా చంద్రబాబు పరిస్థితి తయారయ్యింది.. కనీసం ఒక్క కంప్యూటర్ కూడా బిగించకుండా డబ్బులు ఇప్పించి హవాలా రూపంలో డబ్బులు తెచ్చి కిలారు రాజేష్ కి, పీఏ శ్రీనివాస్ కి ఇచినట్లు ఇన్కమ్ టాక్స్ తెలిపింది అని ఆయన ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version