అంతా ‘నిర్భయ’మే.. ‘ఆమె’కు అండ లేదా..?

-

ముక్కు పచ్చలారని చిన్నారుల దగ్గరి నుండి కాటికి కాలుజాపిన ముసలావ్వల దాకా చిన్న చూపే. ఆడ పిల్ల పుడితే చంపడం.. ఈడుకొస్తే హత్యాచారం.. వయసైపోతే ఆశ్రమం.. పుట్టగానే చెత్త కుప్పలకి చేరే చిట్టి తల్లులు.. లెక్కకు రానీ రేప్ కేసులు, శీలానికి వెల కట్టే పంచాయితి బోర్డులు… నిర్భయ, అభయ, అసిఫా, ప్రియాంక‌రెడ్డి , మానస ఇలా ఎంతమంది.. ఇంకా ఎంతమంది బలి కావాలి.

మార్పు రావాలి.. కానీ ఆ మార్పు ఎక్కడ రావాలి. నిర్భయ చట్టం చేసిన తరువాత కూడా ఇంకా ఇలాంటివి జరుతున్నాయంటే లోపం ఎక్కడుంది. సమస్యను కూకటి వేళ్లతో పెకిలించాలి. సమస్యకు కారణం..? సమస్య పరిష్కారం ఏంటి..? పోరాటం చేయాలి. అవును పోరాటం చేయాలి.. సమస్యపై పోరాటం చేయాలి.. చంపాలి.. అవును చంపాలి అలాంటి ఆలోచనా ధోరణిని చంపాలి. మార్పు ఎక్కడ రావాలి.. తప్పు జరిగాక శిక్షించడం కన్నా ఆ తప్పు చేస్తే అనే ఆలోచనే రాకుండా చేయాలి.. చట్టాలెన్ని వచ్చినా జరిగే అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. తప్పెక్కడ జరుగుతుంది. తప్పు చేయాలన్న ఆలోచన ఎలా వస్తుంది. భయం లేకే. అవును భయం లేకే… ముమ్మాటికి భయంలేకే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. భయం లేకే ఇంతటి దస్సాహసానికి యత్నిస్తున్నారు. మన చట్టాలు ఆ భయాన్ని కల్గించడంలో విఫలమవుతున్నాయి. తక్షణం శిక్ష అమలు పరిచే వ్యవస్థ లేకపోవడం మొదటి చివరి కారణం.

source & Credits : Veris

ఆడ పిల్లను తల్లిలా ప్రేమించే నాన్నలు, అక్కను ఆప్యాయంగా చూసుకునే తమ్ముళ్ళు, భార్యలను ప్రేమించే భర్తలు.. మన ఇంట్లో వారికే ఇలా జరిగితే..? ఊహించుకోవటానికే కష్టంగా ఉంది కదా.. నిన్న ప్రియాంకారెడ్డి, మానసలకు వచ్చిన పరిస్థితే రేపు మన అక్కకో చెల్లికో, స్నేహితురాలికో.. మన అనే వారికెవరికైనా వస్తే?? తట్టుకోగలమా..????? మన వారికి రాదని గ్యారెంటీ ఉందా..?

చీకటిదే తప్పంతా..
చీకట్లో దుష్టశక్తులుంటాయి.. చీకటి పడితే దయ్యాలు తిరుగుతుంటాయి.. కానీ ఆ దయ్యాలు మనిషి రూపంలోనే.. చిక్కనైన చీకటి మనిషిలోని మృగాన్ని నిద్రలేపుతోంది.. ఆ మనుషుల్లో నిద్రానమైన కామాంధకారం నిద్ర లేస్తుంది.. తప్పదాగిన మత్తు మంచి చెడును మరిపిస్తుంది… నగర శివార్లలో చీకటి పడుతుందంటే పరిసరాలు ఒకరకంగా మారిపోతున్నాయి. రింగ్‌ రోడ్డు చూట్టూ అసాంఘిక కార్యాకలాపాలు జరుగుతన్నాయి.. ఇది అందరూ చూస్తూనే ఉన్నాం.. ఒక్కరమైనా స్పందించామా..? స్పందించము ఎందుకంటే మనకెందుకులే అనుకుని. మరి ఎవరికి కావాలి..?

టెక్నాలజీని వాడుకోం..
టెక్నాలజీని సరిగ్గా వాడుకోవడం తెలియని పరిస్థితిలో మన యువత ఉంది. ఫేస్‌బుక్‌లో కమెంట్లు, లైకులు, వాట్సాప్‌లో చాటింగ్లు అంతే.. అంతే తెలుసు.. మనకోసం మన రక్షణ కోసం ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఒక్క యాప్‌ కూడా వాడం.. కనీసం అత్యవసర పరిస్థితి వస్తే పోలీసులను ఆశ్రయించాలన్న ఆలోచన కూడా రాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాక్‌-ఐ మొబైల్‌ యాప్‌ను వాడటం ద్వారా మహిళలు సహాయం పొందవచ్చు..

అత్యవసర పరిస్థితుల్లో ఈ టోల్‌ ఫ్రీ నెంబర్లకు కాల్‌ చెయ్యవచ్చు..
112,100,1090, 181, 1091
నిర్భయ హెల్ప్‌లైన్‌ 9833312222
షీ టీమ్స్‌ – 9140 2785 2355
ఈ క్రింది నెంబర్లకు వాట్సప్‌ చెయ్యవచ్చు…
+91 94906 16555
+91 94906 17111

మెయిల్: womensafetywing@gmail.com
ట్విట్టర్: women safety wing@shesafe_ts

మ‌హిళలు ఎవ‌రైనా స‌రే.. ఎక్క‌డైనా స‌రే.. వేధింపుల‌కు గుర‌వుతుంటే క్రింది తెలిపిన మీకు స‌మీపంలోని ఫోన్ నంబ‌ర్ల‌కు కాల్ చేసి వెంట‌నే షీటీమ్స్ స‌హాయాన్ని పొంద‌వ‌చ్చు.

హైదరాబాద్ సీపీ – 9490616555
రాచకొండ సీపీ – 9490617111
రామగుండం – 9908343838
వరంగల్ సీపీ – 9491089257
ఖమ్మం – 9494933940
ఆదిలాబాద్ – 9963349953
మెదక్ – 9573629009
వికారాబాద్ – 9849697682
నల్గొండ – 9440066044
నిజామాబాద్ – 9490618029
కొత్తగూడెం – 9949133692
సంగారెడ్డి – 9490617005
రైల్వే పోలీస్ సికింద్రాబాద్ – 9440700040
నిర్మల్ – 94090619043
మహబూబ్‌నగర్ – 9010132135
సైబరాబాద్ – 9490617444
కామారెడ్డి – 8985333321
నాగర్ కర్నూల్ – 9498005600
సూర్యాపేట – 9494444833
సిద్ధిపేట – 7901640473
క‌రీంనగర్ – 9440795183
మహబూబాబాద్ – 9989603958
రాజన్న సిరిసిల్ల – 7901132113
జ‌గిత్యాల – 8374020949
వ‌న‌పర్తి – 6303923211
జయశంకర్ భూపాలపల్లి – 9705601290
ఆసిఫాబాద్ కుమ్రం భీం – 9440957623

నిన్న జరిగిన రెండు సంఘటనలు.. షాద్‌నగర్‌లో వెటర్నరీ డాక్టర్‌ ప్రియాంకారెడ్డి హత్య, వరంగల్‌లో మానస హత్య. ఈ రెండు ఘటనలు కూడా క్షమించరానివి. ఈ హత్యాచారాలు చేసింది వేరే గ్రహానికి చెందినవారు కాదు.. మనలో ఒకరు.. ఒక అక్కకు అన్న, ఒక అమ్మకు కొడుకు, ఒక భార్యకు భర్త. ఓ అన్న, ఓ అక్క, ఓ అమ్మ తోటివారిని గౌరవించే సంస్కారం మన పిల్లలకి ఇద్దాం…

– రాజ్‌ తలారి

Read more RELATED
Recommended to you

Exit mobile version