గెలవడానికి అవసరమైనంత దూరం విసిరితే చాలు : నీరజ్ చోప్రా

-

కేవలం 13 నెలల వ్యవధిలోనే ఒలింపిక్స్‌లో స్వర్ణం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం, డైమండ్‌ లీగ్‌లో ట్రోఫీ సాధించి ఓ స్టార్ అథ్లెట్‌కు ఎంత నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, ఫిట్‌నెస్ ఉండాలో చాటి చెప్పాడు గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రా. అయితే స్విట్జర్లాండ్‌లోని డైమండ్ లీగ్‌ ఫైనల్స్‌ను గెలిచిన తొలి భారతీయ జావెలిన్‌ త్రో ఆటగాడిగా టోక్యో ఒలింపిక్స్‌ బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించినా.. ఇప్పటివరకు నీరజ్ 90 మీటర్ల టార్గెట్‌ని చేరుకోలేకపోయాడనే చర్చ తెరపైకి వచ్చింది. డైమండ్ లీగ్‌లోనూ 88.44 మీటర్ల దూరం మాత్రమే విసిరాడు. అయితే సోషల్ మీడియాలో ‘నీరజ్.. జావెలిన్‌ను ఎప్పుడు 90 మీటర్లు విసురుతావు?’ అనే ప్రశ్న తరచూ ఎదురవుతోంది. దీనికి నీరజ్ తనదైన స్టైల్లో సమాధానమిచ్చాడు.

“జావెలిన్‌ త్రో అనేది టెక్నిక్‌తో కూడిన గేమ్. అయితే ఇంకా 90 మీటర్ల మ్యాజికల్‌ మార్క్‌ను అందుకోలేకపోయినందుకు నిరుత్సాహంగా ఏమీ లేదు. ఒక వేళ 90 మీటర్లు విసిరినా విజయం సాధించకపోతే నిరుపయోగమవుతుంది. అందుకే గెలుపు సాధించడానికి అవసరమైనంత దూరం విసిరితే చాలు. అయితే తప్పకుండా ఏదొక రోజు 90 మీటర్ల మార్క్‌ను అందుకొంటాననే నమ్మకం ఉంది. అందుకే నామీద ఎలాంటి ఒత్తిడి లేదు. ఎప్పుడు జరగాలని రాసిపెట్టిందో.. అప్పుడే జరుగుతుంది” అని నీరజ్‌ చోప్రా వివరించాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version