నీట్ ఫలితాలు వాయిదా పడ్డాయి. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 13న జరిగిన ఎగ్జామ్ కు సంబంధించిన ఫలితాలను ఇవాళ విడుదల చేయాలి. అయితే కంటైన్మెంట్ జోన్లలోని విద్యార్ధులు కరోనా కారణంగా పరీక్ష రాయలేకపోయారు. దీంతో వారు రీ ఎగ్జామ్ పెట్టాలని సుప్రీంను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం… ఫలితాలను వాయిదా వేసి మరోసారి కరోనా కారణంగా రాయని వారికి అవకాశం కల్పించాలని ఆదేశించింది. దీంతో ఎగ్జామ్ రాయలేకపోయిన విద్యార్ధులకు ఎల్లుండి పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
అయితే అక్టోబర్ 16న ఫలితాలను విడుదల చేస్తామని ప్రకటించారు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్. ట్విట్టర్ లో ఆయన తేదీలపై ప్రకటన చేశారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన నీట్ ఎగ్జామ్ నిర్వహణ సెప్టెంబర్ 13న జరిగింది. అయితే దేశ వ్యాప్తంగా దాదాపు 15 లక్షల మంది పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ చేసుకోగా…90 శాతం మంది మాత్రమే హాజరయ్యారు. దీంతో మిగితావారు తమకు మరో అవకాశం ఇవ్వాలని కోరడంతో సుప్రీంకోర్టు ఛాన్స్ ఇచ్చింది.