మల్లారెడ్డి కాలేజీపై సంచలన వ్యాఖ్యలు చేసారు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరేళ్ల శారద. పాలమ్మిన, పూలమ్మిన అనే చెప్పుకుంటూ ఉంటాడు మల్లారెడ్డి.ఇప్పుడు రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి బాలికల వీడియోలు అమ్ముకుంటున్నారా అని ప్రశ్నించారు. అలాగే మాజీ మంత్రిని కదా అన్ని మేనేజ్ చేస్తాం అంటే కుదరదు.. మల్లారెడ్డి మహిళా కమిషన్ ముందుకు రావాల్సిందే అని పేర్కొన్నారు.
ఇక సీఎంఆర్ కాలేజీకి ఇప్పటికే సొకాష్ నోటీస్సులు జారీ చేశాం. వార్డెన్ ను, డీన్ ను సస్పెండ్ చేస్తే సరిపోదు.. కాలేజీ యాజమాన్యందే పూర్తి బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి తో చర్చించి ప్రైవేట్ కళాశాలలకు ప్రత్యేక నిబంధనలు తీసుకొస్తాం. హాస్టల్స్ లో చదువుతున్న విద్యార్థినులకు అన్యాయం జరిగితే అసలు సహించం.. కాలేజీని వెంటనే సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతాం అయితే మహిళా కమిషన్ కు ఎలాంటి పవర్స్ లేవని విర్రవీగితే.. చట్టపరమైన చర్యలకు దిగుతాం అని నేరేళ్ల శారద పేర్కొన్నారు.