అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. యాభై వేల పూచికత్తు పై రెండు షూరిటీలు సబ్మిట్ చేయాలంటూ ఆదేశాలు ఇచ్చింది కోర్టు. అయితే పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సమయంలో సాధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట గురించి అందరికి తెలిసిందే. ఈ ఘటనలో ఓ మహిళా చనిపోగా.. ఆమె కొడుకు ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్నాడు. ఇక ఈ ఘటన పై కేసు నమోదు చేసిన చిక్కడిపల్లి పోలీసులు.. అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు.
ఆ తర్వాత బన్నీని అరెస్ట్ చేయగా.. అదే రోజు హై కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది అతనికి. ఇక తాజాగా నాంపల్లి కోర్టు ఆ కేసు విచారణలో ఇరువైపులా వాదనలు విన్న తర్వాత మాములు బెయిల్ ను మంజూరు చేసింది. అయితే బన్నీకి బెయిల్ ఇస్తే కేసు పైన ప్రభావం పడే ఛాన్స్ ఉంది అని పోలీసుల తరపు న్యాయవాది తెలిపిన.. విచారణకు అల్లు అర్జున్ పూర్తిగా సహకరించాలంటూ బెయిల్ మంజూరు చేసింది.