ప్రభాస్ ధరించిన టీషర్ట్ అంత కాస్ట్లీనా.. ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ..!

-

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఇటీవల వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ‘సీతారామం’ ఈవెంట్ లో మెరిసారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా చిత్రాన్ని సపోర్ట్ చేసేందుకు ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరై మూవీ యూనిట్ కు బెస్ట్ విషెస్ చెప్పారు. సినిమాను తప్పకుండా థియేటర్లలోనే చూడాలని సినీ అభిమానులను కోరారు.

‘రాధేశ్యామ్’ సినిమా ప్రమోషన్స్ తర్వాత చాలా కాలానికి ప్రభాస్ ఓ సినిమా ఈవెంట్ లో కనిపించడం పట్ల ప్రభాస్ అశేష అభిమానులు హ్యాపీగా ఫీలయ్యారు. ప్రభాస్ నటిస్తున్న ‘ప్రాజెక్ట్ కె’,‘సలార్’, ‘ఆదిపురుష్’, ‘స్పిరిట్’ చిత్రాలలో నుంచి ఏదేని ఒక అప్ డేట్ ఇవ్వాలని కోరుతున్నారు. ఇకపోతే ‘సీతారామం’ ఈవెంట్ లో ప్రభాస్ హైలైట్ గా నిలిచారని చెప్పొచ్చు.

ముఖ్యంగా ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ ఇచ్చిన స్పీచ్ తో పాటు ఆయన ధరించిన దుస్తుల గురించి నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో డిస్కస్ చేస్తున్నారు. బ్లాక్ కలర్ టీషర్ట్ ప్లస్ జీన్స్ ధరించిన ప్రభాస్ క్యాప్ తో చాలా హ్యాండ్ సమ్ గా కనిపించారు. కాగా, ప్రభాస్ ధరించిన టీ షర్ట్ వెరీ కాస్ట్లీ అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

డోల్స్, గబ్బనా వారు ఈ టీ షర్ట్ ను డిజైన్ చేశారని అభిమానులు చెప్తున్నారు. దీని ధర సుమారుగా రూ.20 వేలకు పైనే ఉంటుందని పేర్కొంటున్నారు. ఇకపోతే ప్రభాస్ ఈ ఈవెంట్ లో థియేటర్ ను గుడితో పోల్చడం చక్కటి పోలిక అని, ప్రభాస్ చాలా చక్కగా మాట్లాడారని వివరిస్తున్నారు.

ఫ్యాన్స్ అందరూ థియేటర్ కు వచ్చి సినిమా చూడాలని పేర్కొన్నారు. శుక్రవారం విడుదలైన ‘సీతారామం’ పాజిటివ్ రివ్యూస్ తో దూసుకుపోతున్నది. ప్రభాస్ ఇచ్చిన పిలుపు కూడా సినిమా సక్సెస్ కు కొంత కారణం అవుతున్నది కావచ్చని సినీ పరిశీలకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version