గచ్చి బౌళి కంచ భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్వాగతించారు. ముఖ్యంగా కంచ భూముల్లో చెట్ల నరికి వేతపై సుప్రీంకోర్టు స్టే విధిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. చెట్ల కొట్టివేతను సుమోటోగా చేపట్టామని.. హైకోర్టు రిజిస్ట్రార్ స్పాట్ కి వెళ్లి రిపోర్ట్ ఇచ్చారు. అటవీ ప్రాంతంలో చెట్లు ఎందుకు తొలగించారు..? 100 ఎకరాలు ధ్వంసం చేసినట్టు నివేదిక వచ్చింది. ఇంత హడావుడిగా ఎందుకు చేపట్టారు అని ప్రశ్నించారు.
అనుమతులు తీసుకున్నారా..? అని కోర్టు ప్రశ్నించింది. ఈనెల 16లోపు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. “సుప్రీం కోర్టు తీర్పు సీఎం రేవంత్ రెడ్డి దుందుడుకు చర్యలకు చెంపపెట్టులాంటిది అన్నారు హరీశ్ రావు. నిన్న పార్టీ ఫిరాయింపుల విషయంలో మొట్టికాయలు, నేడు కంచ భూముల విషయంలో సుప్రీం అక్షింతలు.. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తానంటే చట్టం ఊరుకోదు. ఇది విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు, సామాజికవేత్తల విజయం. వారికి అభినందనలు” అని ట్వీట్ చేశారు హరీశ్ రావు.