నాగర్ కర్నూలు కలెక్టరేట్ కి బాంబు బెదిరింపు..!

-

ఈ మధ్య కాలంలో ఫేక్ కాల్స్ విపరీతంగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రైల్వే స్టేషన్లకు, విమానాశ్రయాలకు, కలెక్టరేట్ కార్యాలయాలకు ఇలా పలు సందర్భాల్లో దుండగులు బాంబు బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. తాజాగా తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కి బాంబు బెదిరింపు కలకలం రేపింది. కలెక్టర్ మెయిల్ కి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అలెర్ట్ అయ్యారు.

మధ్యాహ్నం 3.30 గంటలకు కలెక్టరేట్ ని పేల్చేస్తామని బెదిరింపు మెయిల్ వచ్చినట్టు అధికారులు గుర్తించారు. దీంతో కలెక్టర్ ఆఫీస్ సిబ్బంది అప్రమత్తం అయ్యారు. బాంబు బెదిరింపు పై ఎస్పీ కి ఫిర్యాదు చేశారు. వెంటనే బాంబు స్క్వాడ్ అక్కడికి చేరుకొని క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఫేక్ బెదిరింపు మెయిల్ అని కలెక్టర్ ఆఫీస్ ఈవో చంద్రశేఖర్ తేల్చేశారు. ముప్పల లక్ష్మీనారాయణ పేరుతో మెయిల్ వచ్చినట్టు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తి మెయిల్ లో అల్లాహు అక్బర్ అని పెట్టినట్టు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version