గత కొద్ది రోజుల నుండి కొణిదెల నిహారిక పేరు సోషల్ మీడియాలో బాగా వినపడుతోంది. తనకు కాబోయే పెళ్లి కుమారుడు విశేషాల గురించి తెలిపే పోస్టుల వరకు అంతా సాఫీగా సాగినా, అయితే తాజాగా మెగా డాటర్ పై కొన్ని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను చేసిన తప్పుకు నెటిజన్స్ పెద్దఎత్తున ఆమెపై ఫైర్ అవుతున్నారు. అసలు నీకు బాధ్యత ఉందా..? అంటూ కొందరు నెటిజన్స్ ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. మరి కొందరు ఇలాంటి పనులు చేయడానికి సిగ్గు అనిపించట్లేదా..? అని కూడా ప్రశ్నించారు.
నిజానికి నెటిజెన్స్ అంతగా ఫైర్ అవ్వడానికి గల కారణం చైనా ఉత్పత్తి అయిన వన్ ప్లస్ ఫోన్ కు ప్రమోషన్ చేయడమే నిహారిక చేసిన తప్పు. వన్ ప్లస్ ఫోన్ కు సంబంధించి బ్రాండింగ్ చేస్తూ తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టింది నిహారిక. ఇక అంతే ప్రస్తుతం దేశంలో చైనా ఉత్పత్తులను బ్యాన్ చేయాలని చెబుతుంటే నువ్వు మాత్రం ఇలాంటి ప్రమోషన్స్ చేయడం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. నిజంగా ఈ విషయంలో నిహారిక తెలిసి చేసిందో, లేదంటే తెలీక చేసిందో… కానీ, అడ్డంగా బుక్కయింది పాపం. ఈ నేపథ్యంలో ఆమెకు నెటిజన్స్ వేసే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక ఇబ్బంది పడిపోతుంది. ఇకపోతే త్వరలో చైతన్య జొన్నలగడ్డ తో నిహారిక ఏడడుగులు వేయబోతుంది.