తెలంగాణాలో అడుగుపెట్టేసిన కొత్త కరోనా… న్యూ ఇయర్ వేడుకలు రద్దు…?

-

తెలంగాణాలో కొత్త కరోనా అడుగుపెట్టింది. ప్రపంచ దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ కొత్త కరోనా ఇప్పుడు తెలంగాణాలో అడుగుపెట్టిన నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తెలంగాణా ప్రభుత్వ అధికారులు ఈ వైరస్ కి సంబంధించి అలెర్ట్ అయ్యారు. తెలంగాణ లో కరోనా స్ట్రెయిన్ గుర్తించడంతో వైద్య ఆరోగ్య శాఖ చర్యలకు సిద్దమైంది. వరంగల్ జిల్లాకు చెందిన 49 ఏళ్ల వ్యక్తి కి కరోనా స్ట్రెయిన్ వచ్చిందని గుర్తించారు.

కుటుంబ సబ్యులకు సైతం టెస్ట్ లు చేసి జీన్ మ్యాప్ కోసం సిసిఎంబీ కి శాంపిల్స్ పంపించారు. స్ట్రెయిన్ కేసుల సంఖ్య మరింత గా పెరిగే అవకాశం ఉన్న నేపధ్యంలో వైద్య ఆరోగ్య శాఖ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇవ్వాళ కొత్త కరోనా పై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అవకాశం ఉంది. ఇక త్వరలో జరగబోయే న్యూ ఇయర్ వేడుకలు వద్దు అని తెలంగాణా వైద్యారోగ్య శాఖ అంటుంది.

స్ట్రెయిన్ వ్యాపించి ఉంటే రాత్రి సమయాల్లో ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుందని పేర్కొంది. కొత్త స్ట్రెయిన్ దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇవ్వాళ మధ్యాహ్నం 3 గంటలకు స్ట్రెయిన్ పై రాష్ట్ర ప్రభుత్వ ప్రకటన చేసే అవకాశం ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొత్త కరోనాకు సంబంధించి చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version