ఫేస్‌బుక్ యూజ‌ర్ల‌కు మ‌రో అదిరిపోయే ఫీచ‌ర్ వ‌చ్చేసింది..!!

-

ఫేస్ బుక్ … నేటి త‌రానికి ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ యాప్ కు ఉన్న క్రేజ్ గురించి అంతా ఇంతా కాదు. ఇందులో పర్సనల్ విషయాలు, ఇమేజ్ లు, నచ్చిన పుస్తకాలు, ప్రముఖులు, సినిమాలు, హీరోల గురించి పేజీలు పెడుతుంటారు. ముఖ్యంగా నేటి త‌రంతో ఫేస్ బుక్ ఓపెన్ చేయనిదే నెటిజన్లకు నిద్ర కూడా పట్టడం లేదు. గంటలు గంట‌లు ఏవో పోస్టింగ్ లు అలాగే లైకులు,కామెంట్లు చేస్తూ ఉంటారు.అలాగే ఈ ఫేస్ బుక్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు.

ఫేస్‌బుక్ సైతం యూజ‌ర్ల‌కు ఆక‌ట్టుకునేందుకు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త ఫీచ‌ర్ల‌ను తీసుకువ‌స్తూ ఆక‌ర్షిస్తోంది. తాజాగా ఫేస్‌బుక్ వినియోగ‌దారుల‌కు మ‌రో అద్భుత ఫీచ‌ర్‌ను అందించింది. ఫేస్ బుక్ లో పోస్టులు, న్యూస్ ఫీడ్, కామెంట్లు, వీడియోలతో సమయం ఇట్టే కరిగిపోతుంది. అయితే ఇలా అనవసరంగా సమయం వృథా అవుతోందన్న ఉద్దేశంతో ఫేస్ బుక్ కొత్త ఫీచర్ తీసుకువస్తోంది. అదే క్వైట్ మోడ్. ఫేస్ బుక్ లో యూజర్లు గడిపే కాలాన్ని ఈ ఫీచర్ తో నియంత్రించవచ్చు.

దీని ఉప‌యోగం ఏంటంటే.. మీరు కొంత స‌మ‌యం పాటు ఫేస్ బుక్ చూడకూడదని మీరు టైమ్ సెట్ చేసి క్వైట్ మోడ్ ను ఆన్ చేస్తే, ఆ స‌మ‌యం పాటు మీరు ఫేస్ బుక్ ను చూడడం వీలు కాదు సరికదా, ఫేస్ బుక్ పోస్టులకు సంబంధించి ఎలాంటి నోటిఫికేషన్స్ కూడా రావు. అలాగే క్వైట్ మోడ్ లో ఉన్నప్పుడు మీరు సెట్ చేసిన టైమ్ పూర్తయ్యే వరకు ఫేస్ బుక్ చూడడం కుదరదు అంటూ సందేశం కూడా వస్తుంది. సోషల్ మీడియాలో గడిపే సమయాన్ని తగ్గించుకోవాలనుకునే వారికి ఈ ఫీచర్ బాగా యూజ్ అవుతుంది. ఇక క్వైట్ మోడ్ ఫీచర్ ప్ర‌స్తుతం ఐఫోన్ యూజర్లకు అందుబాటులోకి వ‌చ్చింది. మే నెలలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులో రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version