కేసిఆర్ కి కొత్త తలనొప్పి స్టార్ట్..?

-

దుబ్బాక ఉప ఎన్నికతో మరోసారి తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుందన్న విషయం తెలిసిందే. అధికార టీఆర్ఎస్ పార్టీ దుబ్బాక ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ప్రకటించడంలో జాప్యం చేయడంతో ఎంతోమంది ఆశావాహులు తమకే టిక్కెట్ వస్తుందని ఎంతో ఆశ పెట్టుకున్నారు. ఇటీవల దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి సతీమణి సుజాతా రెడ్డి ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా అధిష్ఠానం ప్రకటించింది. దీంతో ఆశావాహుల గా ఉన్న వారిలో అసంతృప్తి వెల్లువెత్తుతోంది.

అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న చెరుకు శ్రీనివాసరెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిపారు. ఆఖరి నిమిషం వరకు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరినప్పటికీ సీఎం కేసీఆర్ మాత్రం అపాయింట్మెంట్ ఇవ్వలేదు అంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. అంతేకాకుండా దుబ్బాక ఉప ఎన్నికల్లో తమకు టిక్కెట్ వస్తుందని ఆశలు పెట్టుకున్న ఎంతో మంది అభ్యర్థులు కూడా మరికొన్ని రోజుల్లో అసంతృప్తితో తెర మీదికి వచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కేసీఆర్కు ఇది కొత్త తలనొప్పి లాంటిదే అని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version