దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి లై డిటెక్టర్ లేదా నార్కో అనాల్సిస్ చేయించాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. కొత్త ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను ఆషామాషీగా చూడటం లేదని ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఆయన మాటల వెనుక ఎవరున్నారో తేలాలన్నారు.
ప్రభుత్వాన్ని కూల్చాలనుకున్న దద్దమ్మలు జాగ్రత్తగా ఉండాలని ఈ సందర్భంగా అద్దంకి దయాకర్ తీవ్ర విమర్శలు చేశారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చాలని రియల్ కంపెనీలు తమకు ఆఫర్ చేశాయని..ఎమ్మెల్యేల కొనుగోలుకు ఖర్చును తాము భరిస్తామని ఆాఫర్ చేశారని దుబ్బాక ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.