ఐపీఎల్ 2025 కంటే ముందు మెగా వేలం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా IPL గవర్నింగ్ కౌన్సిల్ రిటెన్షన్ పాలసీని ప్రకటించింది. ఈసారి ఐపీఎల్‌లో చాలా కీలక మార్పులు కనిపించనున్నాయి. సెప్టెంబర్ 28 శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైట్ టు మ్యాచ్ కార్డు కూడా వేలానికి తిరిగి వచ్చింది. రైట్ టు మ్యాచ్ కార్డును వినియోగించే నిబంధనలను మార్చడం వల్ల ఆటగాళ్లకు ఎంతో మేలు జరగనుంది.
గత పదేళ్లుగా ఐపీఎల్ ఆడుతూ.. భారత్ కు ఆడని, బీసీసీఐ కాంట్రాక్టు లేని క్యాప్డ్ ప్లేయర్ ను అప్ క్యాప్డ్ గా పరిగణిస్తామని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. దీంతో ఇలాంటి ఆటగాళ్లను ఆయా జట్లు అన్ క్యాప్డ్ ప్లేయర్ గా రిటైన్ చేసుకోవచ్చు. ధోనిని అంటి పెట్టుకునేందుకు సీఎస్కే కు ఇది సాయపడుతుందని.. ఆయన కోసమే ఈ రూల్ ను చేర్చారేమోనని క్రికెట్ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.