పాలసీల మొదలు ట్యాక్స్ దాకా.. ఏప్రిల్ ఒకటి నుండి 6 మార్పులు..!

-

ప్రతీ నెలా కూడా కొత్త మార్పులు వస్తూ ఉంటాయి. పైగా ఇప్పుడు కొత్త ఆర్థిక సంవత్సరం కూడా మొదలు అయ్యింది. మరి ఎలాంటి మార్పులు రాబోతున్నాయి..? ఏయే అంశాల్లో మార్పులు వస్తున్నాయి అనే విషయాలని చూసేద్దాం. టీడీఎస్ కొత్త మార్పులు మొదలు పలు అంశాల్లో మార్పులు వచ్చాయి. ఇక మరి దీని కోసం పూర్తి వివరాలని చూసేద్దాం.

పన్ను శ్లాబుల్లో మార్పులు:

వార్షిక బడ్జెట్ 2023-24లో మధ్య తరగతి వర్గాలని టార్గెట్ చేసి వరాలు అందించారు. కొత్త పన్ను చట్టాన్ని తీసుకొచ్చింది. పన్ను శ్లాబుల్లో కీలక మార్పులు చేసింది. గతంలో పన్ను శ్లాబులు 6 ఉండగా ఐదుకి ఇప్ప్పుడు తగ్గించేశారు. రూ. 3 లక్షల వరకు ఆదాయం ఉంటే ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. రూ.3 నుంచి 6 లక్షల వరకు 5 శాతం పన్ను, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10, రూ.9 లక్షల నుంచి 12 లక్షల వరకు 15 శాతం ఇలా కట్టాల్సి వుంది.

ఈపీఎఫ్ విత్ డ్రా టీడీఎస్:

ఆదాయపు పన్ను చట్టం లోని సెక్షన్ 193 కింద ఉన్న లిస్టెడ్ డిబెంచర్స్ వడ్డీ చెల్లింపుల పై టీడీఎస్ నుంచి పన్ను మినహాయింపులను తొలగించాలని అన్నారు. టీడీఎస్ నుంచి మినహాయింపు అందిస్తుంది. నాన్ పాన్ కేసుల్లో టీడీఎస్ రేటును 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గించారు.

రిబేట్ లో మార్పు:

ఇది వరకు పరిమితి రూ.5 లక్షలుగా ఉండేది. ఇప్పుడు కొత్త ట్యాక్స్ రెజిమ్‌ లో పన్ను మిహాయింపు పరిమితిని రూ.7 లక్షలకు పెంచారు. రూ.7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న ఉద్యోగులు ట్యాక్స్ పే చెయ్యక్కర్లేదు. సెక్షన్ 87ఏ ప్రకారం రిబేట్ పొందవచ్చు.

స్టాండర్డ్ డిడక్షన్:

రూ.15.5 లక్షలకుపైగా సాలరీ ఉంటే ఉద్యోగులు రూ. 52, 500 వరకు పన్ను ప్రయోజనాన్ని పొందొచ్చు. రూ.50వేల టీడీఎస్ అందిస్తోంది. ఎలాంటి బిల్లులు కూడా ఇవ్వక్కర్లేదు.

జీవిత భీమా పాలసీ:

ఏప్రిల్, 1, 2023 తర్వాత తీసుకునే పాలసీల వార్షిక ప్రీమియం కనుక రూ.5 లక్షలు దాటితే వాటికి పన్ను మినహాయింపులు లభించవు.

సెక్షన్ 155లో కీలక సవరణలు:

సెక్షన్ 155లో కీలక సవరణలు చేసింది. ట్యాక్స్ డిడిక్షన్ ఎట్ సోర్స్ టీడీఎస్‌ లో వస్తున్నా సమస్యలను పరిష్కరించడానికి ఇలా చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version