ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. రేపటి నుండి కొత్త నిబంధనలు..!

-

దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం తీవ్రస్థాయిలో పెరిగిపోయింది. AIQ లెక్కల ప్రకారం 200 కంటే ఎక్కువ పాయింట్స్ ఉన్న గాలి మంచిది కాదు. కానీ ఢిల్లీలో ఏకంగా 432 పాయింట్లకు పైగా పెరిగిపోయింది వాయు కాలుష్యం. దాంతో ఖచ్చితమైన కాలుష్య వ్యతిరేక చర్యలు అమలకు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రేపు ఉదయం 8 గంటల నుంచి కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి.

రేపటి నుండి ఢిల్లీలో నిర్మాణ పనులు, కూల్చివేతలు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం. జాతీయ భద్రత, వైద్య ఆరోగ్యం, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఢిల్లీ నగరంలోకి “బిఎస్-3” వాహనాలు, డీజిల్ వాహనాలు ప్రవేశం పై నిషేధం విధించింది. ఢిల్లీలోని రహదారులు, చెట్ల పై నీళ్లు చల్లే వాహనాల సంఖ్య పెంచింది. అలాగే ఐదో తరగతి వరకు పాఠశాలలకు సెలవులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version