పీఎం కిసాన్ యోజన స్కీమ్ ని రైతుల కోసం కేంద్రం తీసుకు వచ్చింది. ఈ స్కీమ్ తో చక్కటి లాభాలని పొందొచ్చు. రైతులకు పీఎం కిసాన్ ద్వారా ఏడాదికి రూ.6000 చొప్పున ఇస్తున్న సంగతి తెలిసిందే. రూ.2000 చొప్పున మూడు విడతల్లో రైతులకి ఇస్తారు. అయితే ఈ స్కీమ్ కి సంబంధించి రూల్స్ మారాయి. పీఎం కిసాన్ పథకాన్ని పొందినట్లయితే జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు ఈ స్కీమ్ లో ఎనిమిది మార్పులను చేసారు.
ఈ పథకం కింద మీ డాక్యుమెంట్‌లను అప్డేట్ చేయకపోయినట్టైతే వెంటనే అప్డేట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఈ స్కీమ్ లో మోసాలు జరుగుతున్నాయి. ఆ మోసాలపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. మీ పత్రాలు నవీకరించబడకపోతే అన్ని వాయిదాలను తిరిగి ఇవ్వవలసి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది.
నకిలీ రైతులు మీద కేంద్రం కఠిన చర్యలు తీసుకుని నోటీసులని కూడా పంపుతోంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు కూడా దీనిని ఉపయోగించుకుంటున్నారు.
పైగా భార్య భర్త కూడా ఈ ప్రయోజనాలని పొందుతున్నారు కనుక అలాంటి వారి మీద కూడా చర్య తీసుకుంటోంది. ఒకే కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ ఈ స్కీమ్ కి అర్హులు కారు.
కేవలం కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.
అనర్హులు ఈ పథకం ప్రయోజనం పొందినట్లయితే వెంటనే ఆ డబ్బుని ఇచ్చేయాలి.
స్వచ్చంధంగా డబ్బులు వాపస్ చేస్తే ఎలాంటి చర్యలు ఉండవు. లేకపోతే మీకే సమస్య.