ప్రపంచంలోనే అతి పెద్ద బంగారు నాణేన్ని లండన్‌లోని ‘ద రాయల్ మింట్’ టంక శాల తయారుచేసింది. అయితే త్వరలో జేమ్స్ బాండ్ 25 వ చిత్రం త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఈ ప్రత్యేక నాణేన్ని రూపొందించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నాణెం బరువు సుమారు 7 కిలోలుగా తెలుస్తుంది. రాయల్ మింట్ గడిచిన 1,100 సంవత్సరాలలో ఇంత బరువైన, ముఖవిలువ కలిగిన కాయిన్‌ను తయారుచేయడం ఇదే మొదటిసారి. ఇది 185 మిల్లీమీటర్ల పొడవు కలిగి ఉంది. దీని వాస్తవ ధరను రాయల్ మింట్ వెల్లడించలేదు. అయితే ఇందులో మరో విశేషం ఏంటంటే బంగారం మరియు వెండి రంగులలో లభించే మెటల్ బార్‌లు 25 అధికారిక జేమ్స్ బాండ్ ఫిల్మ్ టైటిల్స్ మొత్తం వాటిపై చెక్కబడి ఉంటాయి.ఈ నెల చివర్లో లండన్‌లో ప్రదర్శించే “నో టైమ్ టు డై” విడుదలకు గుర్తుగా ప్రారంభించిన అనేక నాణేలు మరియు మెటల్ బార్‌ల సేకరణలో ఇది ఒక భాగం. దీని ధర 8 వేల నుంచి 9 వేల యూరోల మేరకు ఉంటుంది అని తెలుస్తుంది.
185 మిల్లీమీటర్ల వ్యాసంలో ఉన్న ఇది బ్రిటన్ యొక్క అధికారిక నాణెం తయారీదారు రాయల్ మింట్ చేత తయారు చేయబడిన అతిపెద్ద నాణెం గా తెలుస్తుంది. ఈ బృందంలో రెండు కిలోగ్రాముల బరువున్న బంగారు నాణేలు, ఒక కిలోగ్రాము మరియు ఐదు ఒన్స్ ల- ముఖ విలువలు10 యూరోల నుండి 2,000 యూరోల వరకు అలాగే అనేక వెండి మరియు ఇతర నాణేలతో కలిపి ఈ అతిపెద్ద నాణేన్ని తయారుచేసినట్లు తెలుస్తుంది.