కాంగ్రెస్‌కు కొత్త బలం..రేవంత్ సక్సెస్ అయినట్లేనా?

-

వరుసగా రెండుసార్లు అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎలాగైనా తెలంగాణలో పాగా వేయాలనే దిశగానే ముందుకెళుతుంది…అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టి…అధికారం దక్కించుకోవాలని చూస్తుంది. అయితే తెలంగాణలో బీజేపీ బలపడుతున్న విషయం తెలిసిందే…ఒకవేళ బీజేపీ బలపడకుండా ఉంటే…కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు మెండుగా ఉండేవి…కానీ బీజేపీ బలపడటం వల్ల కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు తగ్గుతున్నాయి…అదే సమయంలో కాంగ్రెస్-బీజేపీల మధ్య ఓట్లు చీలితే టీఆర్ఎస్ పార్టీకే మళ్ళీ బెనిఫిట్.

revanth reddy

అంటే తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఊహించని విధంగా మారిపోయేలా ఊన్నాయి….ఇక ఎలాంటి ట్విస్ట్ లు లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలవాలంటే…ఆ పార్టీ బలాన్ని మరింత పెంచుకోవాల్సిన అవసరముంది. అంతర్గతంగా నేతలు కుమ్ములాడుకోకుండా సమన్వయంతో ముందుకెళితే లాభాలు ఉంటాయి. అదే సమయంలో తమకు దూరమైన ఓటు బ్యాంకుని కాంగ్రెస్ పార్టీ దగ్గర చేసుకోవాల్సిన అవసరముంది. మొదట నుంచి కాంగ్రెస్ పార్టీకు రెడ్డి, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు సపోర్ట్ గా ఉంటూ వస్తున్నాయి…గత రెండు ఎన్నికల్లోనూ ఈ వర్గాలు కాంగ్రెస్ పార్టీకి కాస్త దూరమైనట్లే కనిపిస్తున్నాయి.

అయితే రేవంత్ రెడ్డి పి‌సి‌సి అధ్యక్షుడు అయ్యాక కాస్త సీన్ మారుతూ వస్తున్నట్లు కనిపిస్తోంది…రెడ్డి వర్గం మళ్ళీ కాంగ్రెస్ వైపుకే వచ్చింది..అలాగే ఎస్సీ, ఎస్టీ వర్గాలు కూడా కాంగ్రెస్ వైపుకే వస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఇక తెలంగాణలో మెజారిటీ సంఖ్యలో ఉన్న బీసీ ఓటర్లని తమవీపు తిప్పుకుంటే కాంగ్రెస్ పార్టీకి తిరుగుండదు. టీడీపీ ఉండగా…బీసీలు ఆ పార్టీకే సపోర్ట్ గా ఉండేవారు…ఇక టీడీపీ కనుమరుగయ్యాక…బీసీలు…టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపారు…అయితే ఇటీవల బీజేపీ కూడా బీసీలని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేస్తుంది.

కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎఫెక్టివ్ గా ఉంటూ…బీసీలని దగ్గర చేసుకోవాలి…రేవంత్ రెడ్డి సైతం బీసీలని తిప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ బీసీలు…కాంగ్రెస్ వైపుకు వస్తే…ఇంకా తిరుగుండదనే చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version