Breaking : మైనర్‌ బాలిక రేప్‌ కేసు.. ఎమ్మెల్యే కొడుకు అరెస్ట్‌

-

హైదరాబాద్‌లోని అమ్నీషియా పబ్‌ మైనర్‌ బాలిక సామూహిక అత్యాచారం కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపింది. జూబ్లీహిల్స్ బాలిక గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
కాసేపట్లో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ నిందితుల అరెస్టులపై ప్రెస్‌మీట్‌ నిర్వహించనున్నారు. కేసుకు సంబంధించి కీలక
విషయాలు వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. కాగా ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఎమ్మెల్యే కొడుకుతో సహా మొత్తం
ఆరుగురిపై పోలీసులు ఎఫ్ఎస్ఐఆర్ నమోదు చేశారు.

అయితే ఈ ఘటనపై అధికార టీఆర్ఎస్‌ పార్టీపై విపక్షాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో నిందితులుగా ఉన్నవారిని ప్రొటెక్ట్‌ చేస్తున్నారంటూ బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌ రావు ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు మీడియాకు చూపించారు కూడా.. ఈ నేపథ్యంలో మైనర్లు ఉన్న ఫోటోలు, వీడియోలు మీడియా ముందు పెట్టారనే అభియోగంతో రఘునందన్‌రావుపై అబిడ్స్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version