శ్రావణి సూసైడ్ కేసులో ప్రొడ్యూసర్ పేరు.. ఆడియోలు లీక్ !

-

సీరియల్ నటి శ్రావణి సూసైడ్ ఘటన అనేక మలుపులు తిరుగుతోంది. ఆమె మరణానికి దేవ రాజ్ రెడ్డి అనే వ్యక్తి కారణం అని ఆమె తల్లితండ్రులు పోలీసులకి ఫిర్యాదు చేశారు. అయితే తనకు ఏమీ సంబంధం లేదని సాయి అనే వ్యక్తి ఆమె ఆత్మహత్యకు కారణం అని ఆరోపించిన సంగతి తెలిసిందే. సాయి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, తన దగ్గర పూర్తి ఆధారాలు, ఆడియో రికార్డ్స్ ఉన్నాయంటూ నెమ్మదిగా ఒక్కో కాల్ రికార్డ్ ని రిలీజ్ చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ ఏజెంట్ సాయి, శ్రావణి తమ్ముడు శివ, ఆరెక్స్ 100 ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి వల్ల శ్రావణి ఆత్మహత్య చేసుకుందని అంటున్నారు.

తాజాగా ఆరెక్స్ 100 ప్రొడ్యూసర్ అశోక్ రెడ్డి, శ్రావణి మధ్య ఆడియోని రిలీజ్ చేశారు. దేవరాజు మీద శ్రావణి కేసు నమోదు చేసిన సమయంలో ఇద్దరి మద్య ఈ సంభాషణ జరిగినట్టు చెబుతున్నారు. దేవరాజు మీద పెట్టిన కేసు కాంప్రమైజ్ అవకపోతే మన విషయం బయటపెట్టాలని దేవరాజు చూస్తున్నాడని, మనం కలిసినపుడు దేవరాజ్ ఫాలో అవుతాడని, మన విషయం మీద బ్లేమ్ చేయాలని‌ చూస్తున్నాడని ఆమె అశోక్ రెడ్డితో చెబుతుండడం రికార్డింగ్స్ లో ఉంది. మనల్ని దేవరాజ్ బెదిరించాలని చూస్తున్నాడని, నేను దేవరాజ్ మీద కేసు కాంప్రమైజ్ అవుతానని చెప్తున్నానని ఆమె చెప్పడం స్పష్టంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version