వివేకా హత్య కేసులో స‌రికొత్త మ‌లుపులు.. ఏం జ‌రిగిందంటే..?

-

ఎన్నికల ముందు పులివెందులలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడం యావత్ రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇప్పటికీ నిందితులెవరన్నది తేలనేలేదు. అయితే వైఎస్ వివేకా కు సంబంధించిన కేసు విషయంలో ఎప్పటికప్పుడు సరికొత్త ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఇక ప్ర‌స్తుతం దీనిపై సిట్ విచారణ జరుగుతుండగా, కేసును సీబీఐకి అప్పగించాలంటూ వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, టీడీపీ నేత బీటెక్ రవి, మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ సుబ్రమణ్య శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోని సిబిఐ కు అప్పగించాలని కోరుతుండగా ఈ కేసును ఎట్టి పరిస్థితుల్లోనూ సిబిఐకు ఇవ్వొద్దంటూ ప్రభుత్వం తరపున అడ్వొకేట్ జనరల్ హై కోర్ట్ ను కోరినట్టు తెలిపిన వార్త షాకింగ్ ట్విస్టును ఇచ్చింది. ఇప్పటికే ఈ కేసు విచారణను చేపట్టిన సిట్ నివేదిక పూర్తి చేయనుంది అని అలాంటప్పుడు ఈ తరుణంలో మళ్ళీ సిబిఐ కు ఎందుకు ఇవ్వాలని ప్రభుత్వ అడ్వొకేట్ సరికొత్త వాదనను తీసుకొచ్చారు. ఇలా ఎప్పటికప్పుడు ఈ కేసులో సరికొత్త ట్విస్టులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మరి ఈ కేసు ఎప్పుడు తేలుతుందో చూడాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version