అగ్రరాజ్యంలో ఉల్లి తో వ్యాపిస్తున్న కొత్తరకం బాక్టీరియా.. పెరుగుతున్న కేసుల సంఖ్య

-

ఉల్లి చేసే మేలు తల్లికూడా చేయలేదు అంటుంటారు.. కానీ ఇప్పుడు ఆ సామెతకు అగ్రరాజ్యం మినాహాయింపు..ఉల్లిపేరు వింటునే అమెరికా ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అమెరికాలో ఉల్తితింటున్నవారు సాల్మొనెల్లోసీస్ అని వ్యాధిబారిన పడుతున్నారు. సాల్మొనెల్లా అనే బాక్టిరీయా కారణంగా ఈ వ్యాధి వ్యాపిస్తోందట. యూస్ లోని వివిధ రాష్ట్రాల్లో ఇప్పటికే భారీగా కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ బాక్టీరియా వ్యాప్తికి ఉల్లిపాయకు సంబంధి ఉందని సెంటర్స్ ఫర్ డెసీస్ అండ్ ప్రవెన్షన్ తెల్చింది. అక్టోబర్ 18 నాటికే దాదాపు 652 మందికి ఈ వ్యాధి వ్యాపించిందని సీడీసీ చెప్పింది. ఈ బాక్టీరియా విస్తరిస్తే మరిన్ని అనారోగ్యసమస్యలు వచ్చే ప్రమాదం ఉందట.

ఎలా గుర్తించారు

చిహువా, మెక్సికో నుంచి ప్రోసోర్స్ అనే సంస్థ ఉల్లిపాయలను దిగుమతి చేసుకుని దేశంలోని అనేక రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలకు పంపిణీ చేసింది. ఆగస్టు 27వ తేదీన చివరిసారి ఇక్కడి నుంచి ఉల్లిపాయలు దిగుమతి చేసుకున్నారు. వాటిని ఇళ్లలో, రెస్టారెంట్లలో వినియోగించారని సీడీసీ తెలిపింది. ఇవే ప్రస్తుత వ్యాధి వ్యాప్తికి కారణాలని అధికారులు గుర్తించారు. అయితే ఇతర ఉల్లిపాయల సరఫరాదారులకు ఈ సాల్మొనెల్లా వ్యాప్తితో సంబంధం ఉందా అనే కోణంలోనూ అధికారులు ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఉల్లిపాయలు అస్సలు వాడొద్దట

మూడు నెలలపాటు నిల్వ చేసిన ఉల్లిపాయలు, సాల్మొనెల్లా ప్రభావితమైన వాటిని వాడవద్దని సీడీసీ వినియోగదారులను హెచ్చరించింది. ఉల్లిపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియకపోయినా, మెక్సికో నుంచి వచ్చినవైనా, ఎలాంటి స్టిక్కర్ లేకపోయినా, ప్రోసోర్స్ నుంచి వచ్చిన ఉల్లిపాయలైనా.. వాటిని బయట పడేయాలని సీడీసీ సూచించింది.

ఈ నేపథ్యంలో జులై 1 నుంచి ఆగస్టు 27 వరకు దిగుమతి చేసుకున్న ఉల్లిపాయలను వెనక్కు తీసుకునేందుకు ప్రోసోర్స్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది. ఇప్పటికే అన్నీ దుకాణదారులు ఉల్లిపాయలు తిరిగి వెనక్కు పంపాలని ప్రోసోర్స్ రీకాల్ నోటీసులు జారీ చేసిందని ఎఫ్డీఏ తెలిపింది.

వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి

సాల్మొనెల్లా బాధితుల్లో డయేరియా, వాంతులు, జ్వరం, పొట్టలో నొప్పి, డీహైడ్రేషన్ లక్షణాలు కనిపిస్తాయట. ఈ బాక్టీరియా ఉన్న ఉల్లిపాయలు తింటే.. ఆరు గంటల నుంచి ఆరు రోజుల్లో సాల్మొనెల్లోసిస్ వ్యాధి వ్యాపిస్తోందని సీడీసీ పేర్కొంది. వీరిలో చాలా మందికి ఎలాంటి వైద్య చికిత్సలు అవసరం లేకుండానే నాలుగు నుంచి ఏడు రోజుల్లో కోలుకుంటున్నారని సంస్థ ప్రకటించింది. ఈ వ్యాధి వ్యాప్తిని గుర్తించేందుకు దిగుమతైన అన్ని రకాల ఆహార పదార్థాలను పరీక్షిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

అమెరికాలో 37 రాష్ట్రాలకు వ్యాప్తి

ఇప్పటికే అమెరికాలోని 37 రాష్ట్రాల్లో సాల్మొనెల్లా వ్యాపించిందని సీడీసీ గుర్తించింది. టెక్సాస్ రాష్ట్రంలో అత్యధికంగా 158 కేసులు, ఒక్లహామాలో 98, వర్జీనియాలో 59, మేరీల్యాండ్‌లో 58, ఇల్లినాయిస్‌లో 37, విస్కాసిన్‌లో 25, మిన్నెసోటాలో 23, మిస్సోరీలో 21 కేసులు నమోదయ్యాయని సీడీసీ తెలిపింది.

అయితే ఇప్పటి వరకు అధికారికంగా గుర్తించిన కేసుల కన్నా బాధితుల సంఖ్య ఎక్కువే ఉండవచ్చని సీడీసీ అభిప్రాయపడింది. చాలా మందికి సాల్మొనెల్లా పరీక్షలు చేయకముందే వారు కోలుకుంటున్నారని సంస్థ తెలిపింది. ఈ వ్యాధిసోకిన వాళ్లు డాక్టర్ దగ్గరకు వెళ్లేలోపు ఎక్కువగా మంచినీళ్లు తాగాలని నిపుణులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version