రెండు నెలల క్రితం భారత్ పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు చేసిన సందర్భంలో ఎనలేని ప్రేమ ను ఇండియాపై కురిపించారు. గుజరాత్ రాష్ట్రంలో అలహాబాదు స్టేడియంలో డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ ఇండియా అమెరికా కి ఎంతో ఇష్టమైన, నమ్మకమైన దేశం అంటూ ప్రసంగించడం జరిగింది. రెండు దేశాల మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉన్నట్టు ఆ సమయంలో మాట్లాడారు.
అయితే తాజాగా మాత్రం మోడీ – ట్రంప్ ల మధ్య కొత్త గలాటా నెలకొంది. వీసా విధానంతో అమెరికా దేశం నుండి భారతీయులను వెళ్ళగొట్టే ప్రయత్నాలు మొదలు పెట్టిన ట్రంప్, తాజాగా తన ట్విట్టర్ ఖాతా నుంచే మోడీ ని అన్ ఫాలో చేశారు. కేవలం మోడీని మాత్రమే కాదు రాష్ట్రపతి , అమెరికాలోని భారత రాయబార కార్యాలయం ఇలా 19 మంది భారతీయులు ఉన్న లిస్టు ఇప్పుడు 13 కి చేరుకుంది. కారణం ఏంటి అసలు ఆరా తీస్తే ఈ ఏడాది అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో డోనాల్డ్ ట్రంప్ సరి కొత్త స్కెచ్ వేసినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో అమెరికా దేశం గొప్పది అన్నట్టు వ్యవహరించి, దేశంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కేవలం ఇక అమెరికన్ల కే అన్న రీతిలో ఎన్నికల ప్రచారం లో వ్యవహరించే విధానంలో భాగంగా మోడీని ట్రంప్ అన్ ఫాలో చేసినట్టు అమెరికా మీడియా లో టాక్.