వైన్ షాపుల కిటకిట…! మందుబాబుల సందడి…!

-

నూతన సంవత్సర వేడుకలతో హైదరాబాద్ సహా పలు నగరాల్లో బార్లు కిటకిటలాడుతున్నాయి. తాగుబోతుల దినోత్సవం అనే పేరుని సార్ధకం చేస్తు మందుబాబులు వైన్ షాపులు, బార్ల ముందు బారులు తీరారు. హైదరాబాద్ నగరంలో పటాన్ చెరు నుంచి ఉప్పల్ వరకు కూడా ప్రతీ వైన్ షాప్ ముందు పండుగ వాతావరణం నెలకొంది. వైన్ షాపుల వద్ద ట్రాఫిక్ సమస్య కూడా తీవ్రంగానే ఉంది. హైదరాబాద్ తో పాటు ప్రముఖ నగరాలు, విశాఖ, విజయవాడ, గుంటూరు, వరంగల్ ఖమ్మం సహా అనేక నగరాల్లో పెద్ద ఎత్తున వైన్ షాపుల వద్ద జనం బారులు తీరారు.

ఇక ఇదిలా ఉంటా పోలీసులు కూడా మందుబాబుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు కూడా చేసారు. డ్రంక్ డ్రైవ్ టెస్టులకు సిధ్దంగా ఉన్నారు. కీలక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు. వేడుకలు జరిగే పబ్ ల వద్ద పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాటు చేయడమే కాకుండా విదేశీయుల మీద కూడా ఓ కన్నేసి ఉంచారు. డ్రగ్స్ అమ్మకాలు జరుగుతాయి అనే ఈవెంట్ల మీద ప్రత్యేక దృష్టి పెట్టారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version