బాలీవుడ్ స్టార్ కపుల్ రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటించిన చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. దక్షిణాది భాషల్లో ఈ సినిమాను దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌలి ప్రజెంట్ చేయడంతో పాటు విడుదల చేస్తు్న్నారు. ‘బ్రహ్మాస్త్రం’ టైటిల్ తో విడుదల కానున్న ఈ పిక్చర్ లో బాలీవుడ్ బిగ్ బీ అమితా బ్ బచ్చన్, మౌనీ రాయ్, టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున కీలక పాత్రలు పోషించారు.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మూడు పార్ట్ లుగా విడుదల కానుంది. తొలి భాగం..‘బ్రహ్మాస్త్రం: శివ’ ఈ ఏడాది సెప్టెంబర్ 9న విడుదల కానుంది. కాగా, ఈ చిత్రంలో సర్ ప్రైజెస్ కూడా ఉన్నాయని మేకర్స్ చెప్తున్నారు.
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించినట్లు తెలుస్తోంది.
వారి పాత్రలు సినిమా స్టోరిలో భాగంగా ఉండటంతో పాటు సినీ అభిమానులను సర్ ప్రైజ్ చేస్తాయని టాక్. అస్త్రాలన్నిటికీ అధిపతి అయిన బ్రహ్మాస్త్రం చుట్టూ ఈ ఫిల్మ్ స్టోరి తిరుగుతుంది.