హై ఓల్టేజీ యాక్షన్ ఫిల్మ్ లోడింగ్..బాలయ్య అభిమానులకు ఆ రోజు దసరానే

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి నటసింహం బాలయ్య ప్రస్తుతం ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తన 107వ సినిమా చేస్తున్నారు. NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అన్నగారు’, ‘జై బాలయ్య’ అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపైన అంచనాలను భారీగా పెంచేశాయి. ఊర మాస్ లుక్ లో నందమూరి నటసింహం చాలా వయ్ లెంట్ గా ఉండబోతున్నారని పోస్టర్స్ ద్వారా స్పష్టమవుతోంది. కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇందులో విలన్ గా నటిస్తుండగా, శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇక ఈ చిత్రంలో హై ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ ను గోపీచంద్ మలినేని చక్కగా ప్లాన్ చేసినట్లు సమాచారం. శరవేగంగా షూటింగ్ జరుగుతున్న ఈ సినిమా..దసరా కానుకగా విడుదల కానుంది. కాగా, ఆ పండుగ ఈ నెల 10న రాబోతుందట. ఈ నెల 10న బాలయ్య బర్త్ డే సందర్భంగా సినిమా నుంచి అప్ డేట్ ఉండబోతున్నదని తెలుస్తోంది. ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ‘అఖండ’ను మించిన విజయం సాధిస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version