NBK 108లో సర్‌ప్రైజ్..పవర్ ఫుల్ విలన్‌గా తెలుగమ్మాయి?

-

నందమూరి నటసింహం బాలయ్య ప్రజెంట్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘NBK107’ ఫిల్మ్ చేస్తున్నారు. ‘క్రాక్’ తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపైన భారీ అంచనాలు ఉన్నాయి. కాగా, ఈ చిత్రం తర్వాత బాలయ్య ‘F3’ డైరెక్టర్ అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు.

NBK 108 ఫిల్మ్ లో సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ ప్లస్ యాక్షన్ పీక్స్ లో ఉంటాయని మేకర్స్ చెప్తున్నారు. ఈ మేరకు దర్శకుడు అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలల ఈ చిత్రంలో బాలయ్య కూతురిగా నటిస్తోందని సమాచారం. కాగా, ఇందులో బిగ్ బాస్ ఓటీటీ విజేత బిందు మాధవికి ఓ పాత్ర ఇస్తానని అనిల్ మాటిచ్చారు.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న న్యూస్ ప్రకారం..ఈ చిత్రంలో విలన్ గా శక్తిమంతమైన పాత్రను అనిల్ రావిపూడి క్రియేట్ చేశారట. తెలుగమ్మాయి అంజలి ఆ పాత్రను పోషించాలని భావిస్తున్నారని టాక్. బాలయ్య కోసం ఇందులో సరి కొత్త పాత్రను క్రియేట్ చేసిన క్రమంలో పవర్ ఫుల్ విలన్ ఉండాలని అనిల్ రావిపూడి డిసైడ్ అయ్యారట. అయితే, ఈ విషయమై అధికారిక ప్రకటన అయితే రాలేదు.NBK 108 ఫిల్మ్ ను షైన్ స్క్రీన్స్ సంస్థ ప్రొడ్యూస్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version