ఏంటీ.. ఆ ఊరిలో ఒక్కరికి కూడా అవి లేవా?

-

మన ప్రపంచం చాలా చిన్నది అయ్యింది. అర చేతిలో ప్రపంచం కనిపిస్తుంది..అంతగా సైన్స్ , టెక్నాలజీ పెరిగి పోయాయి.అరచేతిలోని సెల్‌ఫోన్‌లో ఇమిడి పోయింది. స్మార్ట్‌ఫోన్‌తో ప్రపంచంలోని జరిగే వింతలు విశేషాలతో పాటు మరెన్నో జరిపిస్తున్న రోజులు ఇవి..అందుకే ఉదయం చేతిలో ఫోన్ లేకుంటే లేవను కూడా లెవరు.అలాగే వినోద సాధనంగా టీవీ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఉంటోంది. మన ఇండియాలోనే ఇలా ఉంటే అభివృధ్ది చెందిన అమెరికాలో ప్రజలు ఇంకేలా వీటిని ఉపయోగిస్తూ ఉంటారో తెలియనిది కాదు. కానీ అమెరికాలోని ఒక నగరంలో టీవీ, మొబైల్ ఫోన్ నిషేధించారంటే నమ్ముతారా? అస్సలు నమ్మరు..కానీ నమ్మాలి. మీరు విన్నది అక్షరాల నిజం అక్కడ ఎటువంటి అప్డేట్ టెక్నాలజీ కూడా లేదు.

ఆ ప్రాంతం గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. అమెరికాలోని గ్రీన్ బ్యాంక్. ఈ నగరం వర్జీనియాలోని పోకాహోంటాస్ లో ఉంది. ఇక్కడ సుమారు 150 మంది నివసిస్తుంటారు. వీరిలో ఎవరికీ మొబైల్ ఫోన్లు కానీ,టీవీలు లేవు.గ్రీన్ బ్యాంక్ సిటీలో ఎటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించటావికి వీలులేదు. టీవీలు, రేడియోలు, మొబైల్‌ల నుండి ఐప్యాడ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు, రిమోట్ కంట్రోల్ బొమ్మలు మరియు మైక్రోవేవ్‌లు కూడా ఇక్కడ నిషేధించబడ్డాయి. ఈ నగరంలో ప్రపంచంలోనే అతి పెద్దదైన స్టీరబుల్ రేడియో టెలిస్కోప్ ఉంది. దీనిని గ్రీన్ బ్యాంక్ టెలిస్కోప్ అంటారు.ఈ టెలిస్కోప్ 485 అడుగుల పొడవు మరియు 76 వందల మెట్రిక్ టన్నుల బరువు కలిగి ఉంది..

ఈ భారీ టెలిస్కోప్ ఉన్నచోట యూఎస్ నేషనల్ రేడియో ఆస్ట్రానమీ అబ్జర్వేటరీ ఉంది. దీనిని 1958లో స్థాపించారు. అంతరిక్షం నుంచి భూమిపైకి వచ్చే అలలపై ఇక్కడ శాస్త్రవేత్తలు అధ్యయనం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గురుత్వాకర్షణ నుండి బ్లాక్ హోల్స్ వరకు అధ్యయనం చేసే పలు టెలిస్కోప్‌లు ఉన్నాయి. వీటి వినియోగంలో ఇబ్బందులు ఏర్పడకూడదనే ఉద్దేశంతోనే ఇక్కడ ఎలక్ట్రానిక్ పరికరాలపై నిషేధం విధించారు. టీవీలు, రేడియోలు, మొబైల్‌ఫోన్లు, ఐప్యాడ్‌లు, వైర్‌లెస్ హెడ్‌ఫోన్‌లు మొదలైనవాటిని నిషేధించారు. ఇటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల నుండి వెలువడే తరంగాలు అంతరిక్షం నుండి వచ్చే తరంగాలను ప్రభావితం చేస్తాయి.అందుకే ఆ ప్రాంతం మొత్తంలొ ఎటువంటి ఎలెక్ట్రానిక్ వస్తువులు లేవు.. మనం అయితే అస్సలు ఉండలేము..

Read more RELATED
Recommended to you

Exit mobile version